‘వంగవీటి, జార్జిరెడ్డి’ చిత్రాలతో బయోపిక్స్ హీరోగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు సందీప్ మాధవ్. అతని తాజా చిత్రం ‘గంధర్వ’. గాయత్రి సురేశ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మించగా ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సమర్పిస్తోంది. ఇక ఈ సినిమాలో శీతల్, సాయి కుమార్, పోసాని, బాబు మోహన్ , సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఈ సినిమా నుంచి విడుదలైన మూడు పాటలు, ట్రైలర్ ఇప్పటికే సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడేలా చేశాయి. ‘గంధర్వ’ ప్రమోషన్స్ లో ఈ సినిమా గురించి దర్శకుడు అప్సర్, హీరో సందీప్ మాధవ్ చెప్పిన విశేషాలు సినిమా మీద మంచి బజ్ ఏర్పడేలా చేశాయి. అద్భుతమైన కొత్త పాయింట్ తో అందరి దృష్టిని ఆకర్షించడానికి దర్శకుడు అప్సర్ సిద్దమవుతున్నారు.
‘గంధర్వ’ చిత్రాన్ని జూలై 1న విడుదల చేయాలని తొలుత దర్శక నిర్మాతలు భావించారు. అయితే ఇప్పుడు జూలై 8కి పోస్ట్ పోన్ చేసినట్టు తెలిపారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ సురేష్ కొండేటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీగా ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. రాప్ రాక్ షకీల్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా, సినిమాటోగ్రఫర్ గా జవహర్ రెడ్డి ఎడిటర్ గా బసవా పైడిరెడ్డి వ్యవహరించారు.