Samyuktha Menon Said She Slapped A Man For Misbehaving: ఎవరైన తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే.. కొందరు అమ్మాయిలు భయంతో వారిని ఏమనలేక మౌనంగా వెళ్లిపోతుంటారు. తాము ఏమైనా అంటే, తిరిగి వాళ్లేమైనా చేస్తారన్న భయంతో సైలెంట్‌గా ఉండిపోతారు. కానీ.. తాను అలా కాదని, ఓ వ్యక్తి చెంప పగలగొట్టాని నటి సంయుక్త మీనన్ పేర్కొంది. తన పట్ల ఓ వ్యక్తి పాడు పని చేసినందుకు.. అతనికి తగిన బుద్ధి చెప్పానంది. ఒకసారి తాను, తన తల్లి కలిసి బయటకు వెళ్లామని.. అప్పుడు ఒక వ్యక్తి సిగరెట్ కాల్చుతూ పొగను తమపై వదిలాడని.. దీంతో తనకు కోపమొచ్చి ఆ వ్యక్తి చెంప పగలగొట్టానని తెలిపింది. అంతేకాదు.. తాజా ఇంటర్వ్యూలో ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలను సంయుక్తం పంచుకుంది.
Adah Sharma: నా నిజాయితీని అపహాస్యం చేశారు.. బెదిరించారు
తాను సమంత వీరాభిమానినని చెప్పిన సంయుక్త.. ఆమె నటనంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. తాను సమంతలానే ఉంటానని చాలామంది చెప్పారని.. ఆమెలాగే నటిస్తున్నానని చెప్తుంటే ఇంకా సంతోషంగా ఉందని చెప్పింది. తనకి ధనుష్ యాక్టింగ్ అంటే బాగా నచ్చుతుందని, తాను 10వ తరగతి చదువుతున్నప్పుడు ధనుష్ నటించిన ఆడుగళం సినిమా పాటలను బస్సులో చూసి డాన్స్ చేసేదాన్నని పేర్కొంది. అలాంటిది.. ధనుష్‌కు జంటగా నటించే ఛాన్స్ తనకు దక్కుతుందని ఎప్పుడూ ఊహించలేదని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తనకు నటనకు అవకాశం వున్న పాత్రలు చేయాలని ఉందని, ముఖ్యంగా కుటుంబ కథా చిత్రాలలో నటించాలని ఆశిస్తున్నానని వెల్లడించింది. తనకు ప్రయాణం చేయడమంటే చాలా ఇష్టమని, అదీ ఒంటరిగా ప్రయాణం చేయడం ఇంకా నచ్చుతుందని చెప్పింది. తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులు విడిపోయారని, అందుకే తండ్రి ఇంటి పేరును తన పేరులో నుంచి తీసేసానని సంయుక్త చెప్పుకొచ్చింది.
Fakes Kidnapping: పరీక్షల్లో ఫెయిల్ అయింది.. కిడ్నాప్ డ్రామాకు తెర లేపింది..
ఇదిలావుండగా.. 2016లో పాప్‌కార్న్ అనే మలయాళ సినిమా ద్వారా సంయుక్త తురంగేట్రం చేసింది. అనంతరం తమిళంలో జులై కాట్రిల్, ఇరుడా చిత్రాలలో నటించింది కానీ, అవేవీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తరువాత తమిళం, తెలుగు భాషల్లో ధనుష్ కథానాయకుడిగా నటించిన ‘సార్’ సినిమాలో హీరోయిన్‌గా నటించి.. అందరి మన్ననలు అందుకుంది. అంతకుముందు పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘భీమ్లా నాయక్’ సినిమాలోనూ కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా పుణ్యమా అని సంయుక్తకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. రీసెంట్‌గా సాయిధరమ్ తేజ్ సరసన విరూపాక్ష సినిమాలో నటించి.. నటిగా సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.