Trivikram: ఆయన టేస్ట్ కి ఒక రేంజ్ ఉంది మావా….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్కూల్ నుంచి బయటకి వచ్చిన హీరోయిన్స్ కి తెలుగులో చాలా మంచి కెరీర్ ఉంటుంది. సమంతా, పూజా హెగ్డేలే అందుకు ఉదాహరణ. ఈ ఇద్దరు హీరోయిన్లు ఈరోజు పాన్ ఇండియా స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే త్రివిక్రమ్ పుణ్యమే. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ లతో నటించిన తర్వాత సమంతా రేంజ్ మారిపోయింది, ఇక అ-ఆ సినిమాతో సామ్ క్రేజ్ వేరే లెవల్ కి వెళ్లిపోయింది. ఈ సినిమాల వెనక ఉన్నది త్రివిక్రమ్ కలమే. పూజా హెగ్డే కూడా ఇంతే… ఎన్టీఆర్ తో అరవింద సమేత, అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో, ఇప్పుడు SSMB 28 సినిమాతో మహేశ్ బాబు పక్కన పూజా హెగ్డే నటిస్తోంది. ఈ సినిమాలు పూజా హెగ్డేని స్టార్ ని చేశాయి. తన హీరోయిన్స్ ని రిపీట్ చేసే అలవాటు ఉన్న త్రివిక్రమ్, ఒక హీరోయిన్ ని ఎంచుకుంటే ఆమె స్టార్ అయ్యే వరకూ అవకాశాలు ఇస్తూనే ఉంటాడు. ఇలియానాని కూడా త్రివిక్రమ్ బాగానే సపోర్ట్ చేశాడు కానీ గోవ బ్యూటీ బాలీవుడ్ పై మనసు పారేసుకోని ఇక్కడ అవకాశాలని మిస్ చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ లిస్టులో కొత్తగా చేరింది మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్. సితార ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేసినా… త్రివిక్రమ్ రచనా సహకారం అందించిన భీమ్లా నాయక్ సినిమాలో రానాకి భార్య క్యారెక్టర్ లో నటించిన సంయుక్త మీనన్ కి తెలుగులో మంచి డెబ్యు దొరికింది. సంయుక్త మీనన్ క్యారెక్టర్ ఒరిజినల్ మలయాళ సినిమా కంటే భీమ్లా నాయక్ లో కాస్త ఎక్కువగా ఉంటుంది. దీంతో మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న సంయుక్త మీనన్, ఆ తర్వాత త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ లాంటి సితారా ఎంటర్టైన్మెంట్స్ తో రెండో సినిమా చేసింది.
ధనుష్ హీరోగా నటించిన బైలింగ్వల్ సినిమా ‘సార్’ మూవీతో సంయుక్త మీనన్ ని మరింత క్రేజ్ వచ్చింది. మాస్టారు మాస్టారు సాంగ్ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో సంయుక్త మీనన్ ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. అలా సమంతా, పూజా హెగ్డేల తర్వాత టాలీవుడ్ కి మరో మంచి హీరోయిన్ ని ఇచ్చాడు త్రివిక్రమ్. ఇప్పటికే భీమ్లా నాయక్, బింబిసారా, సార్, సినిమాతో సాలిడ్ హిట్స్ అందుకున్న సంయుక్త మీనన్ లేటెస్ట్ గా విరుపాక్ష సినిమాలో నటించింది. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ మూవీ మొదటి రోజు మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. విరుపాక్ష మూవీలో సంయుక్త మీనన్ యాక్టింగ్ చూసిన వాళ్లు, త్రివిక్రమ్ ఇంట్రడ్యూస్ చేసిన టాలెంట్ కి కాంప్లిమెంట్స్ అందిస్తున్నారు. సంయుక్త మీనన్ విరుపాక్ష సినిమాతో ఒక నటిగా చాలా మంచి పేరు తెచ్చుకుంది. మరి ఫ్యూచర్ లో ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు లాంటి స్టార్ హీరోల పక్కన సంయుక్త నటిస్తుందా? త్రివిక్రమ్ కి ఫ్యూచర్ లో ఈ హీరోలతో లైనప్ ఉంది కాబట్టి సంయుక్తని రిఫర్ చేస్తాడా అనేది చూడాలి.
Also Read
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
- Ramayana Update: 'రామాయణ' నుంచి నయా పోస్టర్.. ‘జటాయువు’గా స్టార్ నటుడు!
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!