Krithi Shetty: ఉప్పెన సినిమాతో తెలుగుతెరకు పరిచయమై బేబమ్మగా ప్రేక్షకుల మదిలో సెటిల్ అయిపోయింది కృతి శెట్టి. ఈ సినిమా తరువాత అందరి చూపు అమ్మడి మీదనే.. సీనియర్, జూనియర్ హీరోలు అని లేకుండా వరుస ఆఫర్స్ ను అమ్మడు వద్దకు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే అవకాశాలు వచ్చాయి కానీ, ఉప్పెన లాంటి హిట్ ను మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఆ సినిమా తరువాత కొద్దోగొప్పో హిట్ అందుకున్న సినిమా అంటే.. బంగార్రాజు మాత్రమే. సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటించగా , నాగచైతన్య సరసన కృతి శెట్టి నటించింది.గతేడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తరువాత ఈ జంట కలిసి నటిస్తున్న చిత్రం కస్టడీ. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 12 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ileana: ఏం.. ఇల్లూ బేబీ.. నీ బిడ్డకు తండ్రెవరో చెప్తే.. మేము కూడా సంతోషిస్తాం కదా
ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగాన్ని పెంచిన చిత్ర బృందం వరుస ప్రెస్ మీట్స్ తో హంగామా స్టార్ట్ చేసింది. ఇక తాజాగా ఒక ప్రెస్ మీట్ లో కృతి శెట్టి, రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు బోల్డ్ గా సమాధానం చెప్పి ఔరా అనిపించింది. ఉప్పెన తరువాత ఉప్పెనలా అవకాశాలు వెల్లువెత్తాయి. కానీ, అలాంటి విజయం మాత్రం మీకు అందలేదు. మళ్లీ మీకు సక్సెస్ ఇచ్చింది.. చైతన్య సినిమానే.. ఆ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయ్యి.. కస్టడీతో మరో సక్సెస్ వస్తుందని అనుకుంటున్నారా..? అని ఒక రిపోర్టర్ అడగగా.. కృతి మాట్లాడుతూ.. నాగ చైతన్యనే డైరెక్ట్ గా ” మీరు నాకు సక్సెస్ ఇచ్చారా..? అని అడిగేసింది. అందుకు చై.. లేదు.. నీ హార్డ్ వర్క్ నీకు సక్సెస్ ను ఇచ్చింది అని చెప్పుకొచ్చాడు. ఇక సక్సెస్ గురించి ఆమె మాట్లాడుతూ. ” సక్సెస్ అనేది ఒక వ్యక్తి మీదే ఆధారపడి ఉండదు. నిజమే.. నాగార్జున గారు, చై గారు.. ఉండడం వలనే ఆ సినిమా సక్సెస్ అయ్యింది. కానీ, అదే సమయంలో ఆ కథ కూడా అంతే ముఖ్యం.. ఎంటర్ టైన్ గా ఉంటుంది.. అందులోనూ సంక్రాంతికి రిలీజ్ అయ్యింది కాబట్టి ఇంకా హిట్ అయ్యిపోయింది” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కృతి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. ఒక సినిమా హిట్ అయితే అది హీరో వలన అని చెప్పడం ఇండస్ట్రీలో బాగా అలవాటు అయ్యింది. కృతి చెప్పినదాంట్లో తప్పేముంది.. కథ ఉండి, సరైన సమయంలో రిలీజ్ చేస్తే ఏ సినిమా అయినా హిట్ అవుతుంది.. ఏదిఏమైనా బేబమ్మ ఘాటు రిప్లై సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.