Samyuktha Menon: అప్పుడే ఈ మలయాళ బ్యూటీ టాలెంట్ చూపిస్తుందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మలయాళ బ్యూటీ ‘సంయుక్త మీనన్’. మొదటి సినిమాలోనే ఎమోషనల్ సీన్స్ లో కన్వీన్సింగ్ గా నటించి మెప్పించిన సంయుక్త మీనన్ ప్రస్తుతం టాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. భీమ్లా నాయక్, బింబిసార సినిమాల్లో కనిపించింది కాసేపే అయినా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆకట్టుకున్న సంయుక్త మీనన్, ఇటివలే వచ్చిన సార్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. ఈ మూవీలో ధనుష్ పక్కన సంయుక్త బాగా నటించింది. ఈ ఇద్దరి లవ్ ట్రాక్ కి, మాస్టారు మాస్టారు సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో తెలుగులో సంయుక్త మీనన్ మరిన్ని మంచి సినిమాల్లో కనిపించే అవకశాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుతం సంయుక్త మీనన్, కళ్యాణ్ రామ్ తో ‘డెవిల్’ సినిమాలో నటిస్తోంది. సాయి ధరమ్ తేజ్ నటించిన పాన్ ఇండియా సినిమా ‘విరూపాక్ష’లో కూడా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఏప్రిల్ 21న రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఈవెంట్స్ కి వచ్చినా సినిమాల్లో నటించినా సంయుక్త మీనన్ ఎప్పుడూ కాస్త ట్రెడిషనల్ లుక్ లోనే కనిపించింది కానీ మరీ గ్లామర్ గా ఎక్కడా కనిపించలేదు.
మలయాళ సినిమాల్లో అప్పుడప్పుడూ గ్లామర్ గా కనిపించింది కానీ తెలుగులో మాత్రం స్కిన్ షోకి దూరంగానే ఉంటూ వచ్చింది. ఈ బ్యారికేడ్ ని సంయుక్త బ్రేక్ చేసిందో లేక ఆ సీన్ డిమాండ్ చేసిందో తెలియదు కానీ విరూపాక్ష ట్రైలర్ లో సంయుక్తని చూసిన యూత్ కి ఫ్యూస్ లు కొట్టేస్తున్నాయి. విరూపాక్ష సాయి ధరమ్ తేజ్ తో ఒక సీన్ లో సంయుక్త చాలా హాట్ గా కనిపించింది. ఈ ట్రైలర్ నుంచి స్క్రీన్ షాట్స్ తీసుకోని మరీ సంయుక్త హాట్ లుక్స్ ని వైరల్ చేస్తున్నారు. సినిమా ట్రైలర్ కన్నా ఎక్కువగా సంయుక్త మీనన్ ఫోటోస్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతున్నారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కూడా సంయుక్త చాలా గ్లామర్ గా వచ్చింది. బ్లూ డ్రెస్ లో సంయుక్త మీనన్ యూత్ ని ఫిదా చేస్తోంది. ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతూ సంయుక్త సినిమాల్లో కూడా నటిస్తుందా లేక విరుపాక్ష సినిమాలోని ఒక్క సీన్ కి మాత్రమే ఆ గ్లామర్ ట్రీట్ పరిమితం అవుతుందా అనేది చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Haindava Teaser: “ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?”.. ‘హైందవ’ టీజర్ చూశారా!
-
Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
-
AP Alliance Seat Sharing: సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి.. కూటమి నుంచి సింగిల్ లిస్ట్.. బొలిశెట్టి కీలక వ్యాఖ్యలు
-
Tectonic plate movement: మారిపోనున్న ప్రపంచ పటం.. ఒక్కటి కానున్న అమెరికా-రష్యా.!
-
SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..