Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sampoornesh Babu:బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు చాలా కాలం తర్వాత సరికొత్త మేకోవర్‌తో వెండితెరపై కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన భారీ చిత్రం ‘ది పారడైజ్’లో ‘బిర్యానీ’ అనే విలక్షణమైన పాత్రతో సంపూ రీ-ఎంట్రీ ఇచ్చారు. ది ప్యారడైజ్ టీం ప్రత్యేకంగా నిర్వహించిన ‘మీడియా ములాఖత్’లో సంపూర్ణేష్ బాబు మాట్లాడిన మాటలు అందరినీ కదిలించాయి. కెరీర్లో ఎదురైన గ్యాప్, అవకాశాలు లేని సమయంలో పడ్డ వేదనను గుర్తుచేసుకుంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన కెరీర్ ఎదుర్కొన్న ఒడిదుడుకులను వివరిస్తూ సంపూ ఓపెన్ అయ్యారు. “‘కొబ్బరిమట్ట’ విడుదలైన తర్వాత నా ఫోన్ రింగ్ అవ్వడం ఆగిపోయింది. ఆ మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి, పోయాయి కానీ నా ఫోన్ మాత్రం మోగలేదు. సంపూ ఏదో నాలుగు కామెడీ సినిమాలు చేశాడు, ఇక అతని పని అయిపోయింది అనుకున్న సమయంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అన్న నన్ను నమ్మి ఈ పాత్ర ఇచ్చారు. రాజేష్ అన్న అనుకుంటే ‘సంపూర్ణేష్ బాబు’ పుట్టాడు.. ఇప్పుడు శ్రీకాంత్ అన్న అనుకుంటే ‘ది ప్యారడైజ్’లో ‘బిర్యానీ’ పుట్టాడు. నాలో ఉన్న నటుడిని నాకే పరిచయం చేశారు” అంటూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.
హీరో నానితో కలిసి పనిచేసిన అనుభవాన్ని సంపూర్ణేష్ బాబు గుర్తుచేసుకున్నారు. “షూటింగ్ మొదటి రోజే నా చేతిలో బీడీ పెట్టి గెటప్ వేశారు. ఎదురుగా నాని అన్న ఉన్నారు. ఆ క్యారమ్ బోర్డ్ సీన్లో డైలాగ్స్ చెప్పేటప్పుడు ఒకటికి పదిసార్లు టేక్స్ తీసుకున్నాను. అసలు ఈ సినిమాలో నన్ను ఉంచుతారా? తీసేస్తారా? అని భయపడ్డాను. మాలిక్ ఎక్కడ అని నాని అన్న చిన్నగా డైలాగ్ చెబితే నేను చిన్నగా, ఆయన గట్టిగా చెబితే నేను గట్టిగా చెప్పేవాడిని. ఆ కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు నాని అన్న దగ్గరుండి, ‘సంపూ కూల్.. అలా వద్దు, ఇలా చేయి’ అంటూ పక్కనే ఉండి నాతో ఆ సీన్ చేయించారు. నటుడిగా ఎంత ఓపికగా ఉండాలో ఆయనను చూసే నేర్చుకున్నాను” అని అన్నారు. చదువుకునే రోజుల్లో ఎవరి డైలాగులు చెబుతూ పెరిగానో, ఇవాళ వాళ్ల (మోహన్ బాబు గారి) పక్కనే క్యారెక్టర్ చేసే అవకాశం రావడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని సంపూ అన్నారు. థియేటర్లలో ప్రేక్షకులు ‘ది ప్యారడైజ్’ పాటలకు, సన్నివేశాలకు డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే మాటల్లో చెప్పలేనంత ఆనందం కలిగిందని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి ఇంత మంచి బ్రేక్ ఇచ్చిన చిత్ర బృందానికి, నిర్మాతలకు, తోటి టెక్నీషియన్లకు సంపూర్ణేష్ బాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Also Read
- Srikanth Odela: "అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!"
- The Paradise: 'పెద్ది' రిజల్ట్ చూశాక కూడా 'ది పారడైజ్' పాఠాలు నేర్వలేదా?
- Jr NTR: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గాయం తర్వాత ఫస్ట్ టైం రాజమౌళి కొడుకు కోసం పబ్లిక్‌లోకి ఎన్టీఆర్!
- Chiranjeevi – Odela Movie: 'కాకా' తర్వాత శ్రీకాంత్ ఓదెలతో సినిమా డౌటేనా?.. మెగా కాంబోపై సస్పెన్స్!
తాజావార్తలు
-
Sampoornesh Babu: ‘కొబ్బరిమట్ట తర్వాత ఆగిన నా ఫోన్.. మళ్లీ ‘ది ప్యారడైజ్’ కే మోగింది!’.. సంపూర్ణేష్ బాబు ఎమోషనల్
-
Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
-
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
-
Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?