Samarasimha Reddy & Simhadri Movies Re Release at a time: బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య రీ రిలీజ్ వార్ నడుస్తోందా? బాలకృష్ణ సమర సింహారెడ్డితో వస్తే… ఒక రోజు ముందే సింహాద్రిని తీసుకొస్తున్నారు. బాలయ్య వస్తున్నాడని తెలిసి.. కావాలనే రిలీజ్ చేస్తున్నారా? ఇది ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెడుతుందా? అనే చర్చలు జరుగుతున్నాయి. సింహాద్రి సినిమాకి రీ రిలీజ్ కొత్తేమీ కాదు.. ఇప్పటికే రెండు, మూడుసార్లు రీరిలీజ్ అయింది. అయినా… మరోసారి థియేటర్స్‌లోకి అందులోనూ..సమరసింహారెడ్డికి ఒక రోజు ముందు తీసుకు రావడంతో.. బాలయ్య ప్యాన్స్ మండిపడుతున్నారు. కావాలనే కయ్యానికి కాలు దువ్వుతున్నారంటూ… విమర్శిస్తున్నారు. మార్చి 2 సమరసింహారెడ్డి వస్తోందని రెండు వారాల క్రితమే ప్రకటించారు. 1న రవితేజ మిరపకాయ్ రిలీజ్ అవుతోంది.
Anant-Radhika Pre-wedding: అనంత్-రాధిక ప్రీవెడ్డింగ్‌కి హాజరయ్యే ప్రముఖులు వీరే!
ఈ రీ రిలీజ్ డేట్‌ను కూడా వారం క్రితమే ప్రకటించారు. అయితే.. లేటెస్ట్‌గా సింహాద్రి బరిలోకి దిగడం షాక్ ఇస్తోంది. అసలే బాబాయ్ అబ్బాయ్ మధ్య సంబంధాలు సరిగా లేవు. ఇలా రీ రిలీజెస్‌తో ఢీ కొడితే.. గ్యాప్ మరింత పెరగడం ఖాయం. బాబాయ్ అబ్బాయ్ 2016 సంక్రాంతి రేసులో ఢీ కొట్టారు. బాలకృష్ణ డిక్టేటర్‌తో.. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో వస్తే.. అబ్బాయి విజయం సాధించాడు. అప్పట్లో ఈ ఇద్దరి మధ్య దూరం పెద్దగా లేకపోవడంతో…సంక్రాంతి రేసులో ఇద్దరూ పోటీపడ్డా.. ఫ్యాన్స్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే.. రీ రిలీజెస్‌తో ఒకేసారి వస్తే.. కావాలనే ఇదంతా చేస్తున్నారన్న సంకేతాలు పంపినట్టు అవుతోంది. ఈ విషయంలో ఖచ్చితంగా చర్చ జరుగుతోంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.