Pushpa 2 సినిమా షూటింగ్ కు సన్నాహాలు మొదలయ్యాయి. డిసెంబర్ లో విడుదలైన ‘పుష్ప’ చిత్రం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. సినిమా అంతా ఒక ఎత్తు అయితే, సామ్ సాంగ్ సినిమాకు ప్రధాన హైలెట్ అయ్యింది. సినిమాలోని స్పెషల్ సాంగ్ “ఊ అంటావా మావా” అంటూ ఉర్రూతలూగించింది ప్రేక్షకులను. సమంత బోల్డ్‌నెస్, కిల్లర్ లుక్స్ తో అభిమానుల హృదయాలను కొల్లగొట్టేసింది. ఇక ఈ స్పెషల్ సాంగ్ కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు… 100 మిలియన్ వ్యూస్ కూడా దాటేసి సంచలనం సృష్టించింది. అయితే ‘పుష్ప-2’లో కూడా సామ్ ఉంటుందా? స్పెషల్ సాంగ్ సంగతేంటి ? వంటి ఆలోచనలు ప్రేక్షకుల మదిలో మెదులుతున్నాయి.
Read Also : Samantha : ఎట్టకేలకు చైని ఫాలో చేయడం ఆపేసిన బ్యూటీ
తాజా సమాచారం ప్రకారం “పుష్ప 2″లో స్పెషల్ సాంగ్ కోసం సమంత స్థానంలో బాలీవుడ్ నటి దిశా పటానీని తీసుకోనున్నారట మేకర్స్. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ రూమర్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నిజానికి “ఓ అంటావా” సాంగ్ కోసం దిశాతో పాటు పలువురు బాలీవుడ్ భామలను మేకర్స్ సంప్రదించినట్టు, అయితే రెమ్యూనరేషన్ వంటి కారణాలతో ఈ సాంగ్ చేయడానికి వారు తిరస్కరించినట్టు పుకార్లు షికార్లు చేశాయి. మరి “పుష్ప-2″లో ఏం జరుగుతుందో చూడాలి.