Samantha : స్టార్ హీరోయిన్ సమంత ఏదో ఒక టాపిక్ తో సోషల్ మీడియాలో అటెన్షన్ తీసేసుకుంటుంది. ఈ విషయంలో నో డౌట్. ఈ నడుమ లైఫ్, సక్సెస్ అంటూ కొన్ని మోటివేషన్లు కూడా ఇస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఇలాంటి కామెంట్స్ చేసి మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ పై కామెంట్ చేసే సమంత తాజాగా స్వేచ్ఛ అంటే ఏంటో చెప్పేసింది. స్వేచ్ఛగా బతకడమే అసలైన సక్సెస్ అని చెప్పడం తాజాగా వైరల్ అవుతోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చాలా విషయాలపై స్పందించింది.
Read Also : Mangli: గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ సాంస్కృతిక కార్యక్రమాల్లో సింగర్ మంగ్లి
నేను సినిమాల్లో ఉన్నన్ని రోజులు ఒక మోడ్ లో ఉండిపోయాను. అప్పుడు స్వేచ్ఛ అనేది నేను పట్టించుకోలేదు. సక్సెస్ అవ్వాలని కలలు కన్నాను. కానీ సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న తర్వాతనే నాకు అసలైన సక్సెస్ అంటే ఏంటో అర్థం అయింది. స్వేచ్ఛగా బతకడమే అసలైన సక్సెస్ అని తెలుసుకున్నాను. అందుకే బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేస్తున్నాను. ఫెయిల్యూర్స్ అనేవి మనకు ఎంతో నేర్పిస్తాయి.
వాటిని ఆస్వాదించాలి. వద్దనుకోవద్దు. మన లైఫ్ లో ఎలా ఉండాలో నేర్పించేవి ఫెయిల్యూర్స్. నాకు అవే బెస్ట్ టీచర్స్ అని భావిస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది సమంత. రీసెంట్ గా శుభం మూవీతో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చింది. దానికి పాజిటివ్ టాక్ రావడంతో మరిన్ని సినిమాలు నిర్మించేందుకు రెడీ అవుతోందంట ఈ బ్యూటీ. ఇక నటిగా ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తుందా అని ఆమె ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Read Also : Trivikram Srinivas : గురూజీ ముందు జాగ్రత్త.. మిగతా డైరెక్టర్లు నేర్చుకోవాలా..?