Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Samantha Ruth Prabhu Another Post On Instagram

Samantha Ruth Prabhu: మరో షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత.. ఫేస్ లేకుండానే..

Published Date :October 11, 2022 , 9:23 am
By NTV WebDesk
Samantha Ruth Prabhu: మరో షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత.. ఫేస్ లేకుండానే..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Samantha Ruth Prabhu Another Post On Instagram: కొంతకాలం నుంచి సోషల్ మీడియాకు దూరంగా ఉన్న సమంత.. రీసెంట్‌గా ఒక పోస్ట్ పెట్టి వార్తల్లోకెక్కింది. తన పెంపుడు కుక్క ఫోటో పెట్టి, ‘డౌన్ అయ్యానే తప్ప ఔట్ అవ్వలేదు’ అనే క్యాప్షన్ పెట్టింది. అంటే.. తాను కాస్త ఆందోళనలో ఉన్నాననే విషయాన్ని ఆ పోస్ట్ ద్వారా చెప్పకనే చెప్పింది. ఇప్పుడు తాజాగా ఈ అమ్మడు మరో పోస్ట్ పెట్టింది. ఈసారి తన ముఖం చూపించకుండా.. ‘యు విల్ నెవర్ వాక్ ఎలోన్’ అని రాసి ఉన్న టీషర్ట్ ఫోటో పెట్టింది. దీనిపై కొందరు సెలెబ్రిటీలు స్పందిస్తూ.. హార్ట్ సింబల్స్ ఉన్న ఎమోజీలను షేర్ చేయడంతో పాటు ‘మోర్ పవర్ టు యు’ అంటూ ఆమెలో ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. అటు.. అభిమానులు సైతం ‘మేమెప్పుడు మీ వెంటే ఉంటాం, మీరు ధైర్యంగా ఉండండి’ అంటూ బదులిస్తున్నారు.

కాగా.. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కొంతకాలం మౌనం పాటించిన సమంత, ఆ తర్వాత తిరిగి ఫుల్ జోష్‌తో తిరిగొచ్చింది. వరుసగా సినిమాలు చేయడంతో పాటు కాఫీ విత్ కరణ్ వంటి షోలలో పాల్గొంది. విడాకుల సమయంలో తానెంతో మనోవేదనకు గురయ్యానని, ఇప్పుడు మాత్రం పూర్తిగా కోలుకున్నానంటూ కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ, మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కొన్ని రోజులు సోషల్ మీడియాకి బ్రేక్ ఇచ్చి, ఇప్పుడు ఈ తరహా పోస్టులు పెడుతోంది. దీంతో.. సమంతకి ఏమైందా? అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. ఈమె సర్జరీ చేయించుకుందన్న రూమర్లతో పాటు ఆమె అనారోగ్యం బారిన పడిందన్న వార్తలూ చక్కర్లు కొడుతున్నాయి. ఆమె మేనేజర్ ఆ వార్తల్లో వాస్తవం లేదని తోసిపుచ్చినా, రూమర్లు మాత్రం తగ్గడం లేదు. దీనిపై స్పష్టత రావాలంటే, సమంత బయటకొచ్చి స్పందించేదాకా వేచి చూడాల్సిందే!

Also Read

  • NBK - Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..
  • Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
  • Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
  • Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్

ఇక సమంత కెరీర్ విషయానికొస్తే.. రెండు వెబ్ సిరీస్‌లతో పాటు పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఆమె నటించిన యశోద, శాకుంతలం సినిమాలకు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అలాగే, బాలీవుడ్ వెండితెర తెరంగేట్రానికి కూడా ఈ అమ్మడు సిద్ధమవుతోంది. ‘ద ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్‌తో వచ్చిన క్రేజ్ కారణంగా.. పాన్ ఇండియా నటిగా అవతరించడంతో భారీ ఆఫర్లు ఒకదాని తర్వాత మరొకటి వచ్చిపడుతున్నాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bollywood
  • Samantha - Instagram
  • Samantha Ruth Prabhu
  • Shakunthalam
  • Yashoda movie

తాజావార్తలు

  • వందేళ్ల వైభవానికి అరుదైన గౌరవం.. Andhra Universityకు కేంద్రం ప్రత్యేక గుర్తింపు

  • Fire Accident : అంబర్‌పేటలో భారీ అగ్నిప్రమాదం.. తగలబడిన షోరూం గోదాం..

  • KCR : రాష్ట్రం బొందలో పడ్డట్టు అయింది.. ఇది ఒక చిల్లర ప్రభుత్వం..!

  • Iranian Attack Indian Crew: ఒమన్‌ తీరంలో టెన్షన్ టెన్షన్.. భారతీయ సిబ్బంది ఉన్న కెమికల్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడులు!

  • Petrol Shortage: పెట్రోల్ బంకుల్లో నిబంధనలు.. ద్విచక్ర వాహనానికి రూ.200, కారుకు రూ.1000 మాత్రమే..

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions