టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత జీవితం గత కొన్నేళ్లుగా ఒక రోలర్ కోస్టర్ రైడ్‌లా సాగింది, నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు వర్ణనాతీతం. అటు వ్యక్తిగత బాధ, ఇటు మయోసైటిస్ వంటి అరుదైన వ్యాధి.. వెరసి సమంత శారీరకంగా, మానసికగా ఎంతో కుంగిపోయింది. ముఖంలో ఆ పాత చమక్కు పోయిందని, వరుస ఫ్లాపులతో కెరీర్ కూడా డల్ అయిపోయిందని విమర్శలు వచ్చాయి. కానీ, ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది, విడాకుల చేదు జ్ఞాపకాలను చెరిపేస్తూ, రాజ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత సమంతలో మళ్ళీ పాత ‘చలాకీ’తనం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉంది, కేవలం భార్యగానే కాకుండా, నిర్మాతగా కూడా కొత్త అవతారమెత్తి ‘శుభం’ అనే సినిమాను అందించింది. ఇప్పుడు ఆమె నటిస్తూ, నిర్మిస్తున్న ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి భర్త రాజ్ స్వయంగా నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.
Also Read:Peddi: పెద్ది పెహల్వాన్ గ్లింప్స్ రిలీజ్.. కన్‌ఫ్యూజన్‌లో మెగాఫ్యాన్స్
హోళీ, ఉగాది వేడుకల్లో ఆమె సందడి చూస్తుంటే, సమంత మళ్ళీ తన పూర్వవైభవాన్ని సంతరించుకుందని అర్థమవుతోంది. ఇటీవల జరిగిన ‘ఉమెన్ ఇన్ ఎంటర్‌టైన్‌మెంట్’ ఈవెంట్‌లో పాల్గొన్న సమంత, మహిళల మనస్తత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గడానికి ప్రధాన కారణం ‘సారీ’ అని ఆమె పేర్కొంది. “పురుషులతో పోలిస్తే మహిళలే ప్రతి చిన్న విషయానికీ అనవసరంగా సారీ చెబుతుంటారు. అలా పదే పదే క్షమాపణలు కోరడం వల్ల తెలియకుండానే మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. అవసరం లేని చోట సారీ చెప్పాల్సిన పని లేదు” అంటూ సామ్ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
