Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ స్టోరీ లైన్ లీక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా ఎన్టీవీకీ సమంత ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మా ఇంటి బంగారం’ యూనిట్ సందడి చేసింది. ఈ సందర్భంగా సినిమా అసలు కథ ఏంటి? ఇందులో సమంతతో పాటు ఇతర పాత్రల ప్రాధాన్యత ఏంటనేది సమంత లీక్ చేసేశారు. సమాజంలో ఒక పర్ఫెక్ట్ అమ్మాయిని లేదా కోడలిని ‘బంగారం’ అని పిలవడానికి అందంగా ఉండాలి, వంట రావాలి, పాటలు పాడాలి అనే కొన్ని రూల్స్ ఉంటాయని సమంత గుర్తుచేసింది. అయితే తనకు వంట రాదని, అంత మాత్రాన తాను బంగారం కాదా? అని ప్రశ్నించింది.
ఇదే పాయింట్ పై దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో మొదటి బంగారం సమంత కాదు.. శ్రీముఖి (అనుసూయ క్యారెక్టర్). ఇంట్లో అందరి అటెన్షన్ ఆమె చుట్టూనే ఉంటుంది. ఈ క్రమంలో ఇద్దరు తోటికోడళ్ల మధ్య జరిగే కాంపిటీషన్, ఆమెను రీప్లేస్ చేసి సమంత ఎలా ‘మా ఇంటి బంగారం’గా మారింది అనేదే అసలు కథ” అని రివీల్ చేశారు. సాధారణంగా సమంతకు ఏదీ అంత తొందరగా నచ్చదని ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. దీనిపై సమంత స్పందిస్తూ.. “నాకు వేరే వాళ్ళ సినిమాలు చూసి నచ్చితే వెంటనే చాలా బాగుందని చెప్పేస్తాను. కానీ నన్ను నేను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు నాలో ఒక ‘క్రిటికల్ సమంత’ బయటకు వస్తుంది. ఇది బాలేదు, అది ఇంకా బెటర్ గా చేయాల్సింది అని నా మీద నాకే జడ్జ్మెంట్ పోతుంది. కానీ ఈ సినిమా విషయంలో ప్రతిరోజూ షూటింగ్ ముగించుకుని ఇంటికెళ్ళేటప్పుడు ఒక నటిగా నాకు పూర్తి తృప్తి కలిగింది. 15 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్నా, ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ఇంప్రూవ్మెంట్ చూపించకపోతే జనాలు బోర్ ఫీలవుతారు. ఈ సినిమాలో నా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది” అని ధీమా వ్యక్తం చేసింది.
Also Read
- Samantha : సమంత 'మా ఇంటి బంగారం'కు పోటీగా దిగుతోన్న నాలుగైదు సినిమాలు
- Rashmika Mandanna : రష్మిక మూవీకి 'A' సర్టిఫికెట్... త్వరలోనే థియేటర్లలోకి
- Peddi : మున్నా భయ్యాకు హ్యాండిచ్చిన 'పెద్ది '... వెంకీ మామ సినిమా అయినా కలిసొచ్చేనా ?
- Dassahra Movies : దసరా బరిలో బాలయ్య, చిరు, వెంకీ, నాగ్.. విజయం ఎవరిని వరిస్తుందో
తాజావార్తలు
-
Maa Inti Bangaram: సమంత ‘మా ఇంటి బంగారం’ స్టోరీ లైన్ లీక్!
-
Israel : ఇరాన్ – అమెరికా ఒప్పందంలో ఇజ్రాయెల్ ‘నిప్పులు’.. గంటల వ్యవధిలోనే లెబనాన్ సరిహద్దుల్లో బాంబుల మోత!
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ కోసం డ్యాన్స్ చేయమంటే సమంత ఏడ్చేసింది!
-
Samantha : సమంత ‘మా ఇంటి బంగారం’కు పోటీగా దిగుతోన్న నాలుగైదు సినిమాలు
-
OnePlus N6: వన్ప్లస్ ఎన్6 రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ తేదీన విడుదల, డిజైన్ వెల్లడి
ట్రెండింగ్
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?
-
INDw vs PAKW: భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. వరల్డ్కప్ చరిత్రలోనే సరికొత్త రికార్డులు!
-
Deepti Sharma Record: దీప్తి శర్మ వరల్డ్ రికార్డ్.. అంతర్జాతీయ మహిళల టీ20ల్లోనే తోపు!