టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరోసారి పెళ్లి చేసుకుంది. కోయంబత్తూరులోని సద్గురు ‘ఈషా ఫౌండేషన్’ లో అతి కొద్దీ మంది బందు మిత్రుల సమక్షంలో వేద పండితుల సాక్షిగా సమంత – రాజ్ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. దాదాపు ఏడాది కాలంగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ ఎక్కడికి వెళ్లిన ఇద్దరి కలిసి వెళ్లడం సోషల్ మీడియాలో పోస్ట్ లు చేయడంతో వీరి రిలేషన్ ను కన్ఫమ్ అయింది. అయితే వీరు పెళ్లి చేసుకుంటారా లేక డేటింగ్ లో మాత్రమే ఉంటారా అనుమాలు లేకపోలేదు. అయితే ఆ వార్తలకు చెక్ పెడుతూ అందరికి షాక్ ఇచ్చింది.
Also Read : Samantha : మళ్ళీ పెళ్లి చేసుకున్న సమంత.. వరుడు ఎవరంటే?
సింపుల్ గా నిరాడంబరంగా రాజ్ ను వివాహం చేసుకుని ప్రేమను పెళ్లిగా మార్చుకుంది సమంత. అయితే సమంత పెళ్లి చేసుకున్న రాజ్ నిడిమోరు ఎవరని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. రాజ్ నిడిమోరు రాజ్ నిడిమోరుఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో 1975 జన్మించారు. కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేసిన రాజ్ నిడిమోరు USAలో సాఫ్ట్ వేర్ లో కొనేళ్లపాటు ఉద్యోగం చేశారు. సినిమాల పట్ల మక్కువతో ఫిల్మ్ మేకింగ్‌లోకి అడుగుపెట్టారు. దర్శకత్వ శాఖలో అనుభవం గడించి 2002లో షాదీ.కామ్ అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత డీ ఫర్ దోపిడీ అనే మరో సినిమాను డైరెక్ట్ చేసిన రాజ్ ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ లో అడుగుపెట్టి ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఆ సిరీస్ సూపర్ హిట్ కావడంతో ఫ్యామిలీ మాన్ సీజన్-2 ను తెరకెక్కించాడు. ఈ సిరీస్ లో సమంత నటించింది. ఈ సిరీస్ లో షూటింగ్ లో టైమ్ లోనే ఇద్దరి మధ్య పరిచయం ప్రేమ వరకు వెళ్ళింది. ఆ ప్రేమ కాస్త ఈ రోజు పెళ్లిగా మారింది. ఏదేమైనా మరోసారి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన రాజ్ – సామ్ దంపతులకు శుభాకాంక్షలు.