NTV Exclusive: సమంత ‘మా ఇంటి బంగారం’ సైలెన్స్ ఎందుకు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు స్వయంగా నిర్మిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’. ‘ఓ బేబీ’ లాంటి సూపర్ హిట్ తర్వాత సామ్ – నందిని రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. మే 15న రిలీజ్ అని మేకర్స్ గతంలో ప్రకటించారు. సుమతో ఒక ఇంటర్క్యూ సహా సమంత పుట్టినరోజు ఈవెంట్స్ కాకుండా పెద్దగా ప్రమోషన్స్ ఏవి చేయ లేదు. నిజానికి మొదట మే 15ను పక్కా డేట్‌గా భావించారు. ముఖ్యంగా యష్ ‘టాక్సిక్’ సినిమా వాయిదా పడటంతో, ఆ విండోను క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేసిన కొందరు డిస్ట్రిబ్యూటర్లు సినిమాని జూన్ 4వ తేదీన రిలీజ్ చేయించాలని అనుకున్నారు. కానీ, తాజా పరిణామాలు చూస్తుంటే పరిస్థితులు మారినట్లు కనిపిస్తోంది. జూన్ 4న ‘పెద్ది’ వస్తుండటం, ఆ వెంటనే జూన్ నెలాఖరులో ‘లెనిన్’ వంటి భారీ చిత్రాలు లైన్లో ఉండటంతో సమంత సినిమాకు సరైన రిలీజ్ డేట్ దొరకడం సవాల్‌గా మారింది.
ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ టీమ్ ముందు రెండు ఆప్షన్లు మాత్రమే కనిపిస్తున్నాయి, అవేమంటే పెద్దగా రిస్క్ చేయకుండా మే 15నే రావడం, లేదా రిస్క్ చేసి పెద్ది రిలీజ్ అనంతరం జూన్ రెండో వారం లేదా జూన్ మధ్యలో రిలీజ్ ప్లాన్ చేయడం. సమంత-నందిని రెడ్డి కాంబో అంటే కచ్చితంగా మినిమం గ్యారెంటీ కంటెంట్ ఉంటుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే సినిమా ఎంత బాగున్నా, బాక్సాఫీస్ వద్ద సరైన వసూళ్లు రావాలంటే పక్కా రిలీజ్ ప్లానింగ్ అవసరం. ప్రమోషన్స్ లేకుండా సడన్‌గా థియేటర్లలోకి వస్తే బాక్సాఫీస్ ఇంపాక్ట్ పడే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరి సమంత ఈ సస్పెన్స్‌కు ఎప్పుడు స్వస్తి పలుకుతుందో చూడాలి. ‘మా ఇంటి బంగారం’ నిజంగానే మే నెలలో మెరుస్తుందా? లేక జూన్‌కు షిఫ్ట్ అవుతుందా? అన్నది త్వరలోనే తేలనుంది.
Also Read
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
- Venkat K Narayana: జన నాయగన్ సినిమాలో ఆ 'టెక్నీషియన్‌ను మార్చాలన్న' దళపతి విజయ్.. కానీ!
- Toxic: 'టాక్సిక్'లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
తాజావార్తలు
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
-
Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
-
TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
-
Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
-
Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!