Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఒక ఏడాది సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆమె ప్రపంచాన్ని చుట్టేయడానికి రెడీ అయింది. ఇప్పటికే మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత చికిత్స కోసమే ఈ బ్రేక్ తీసుకుందని వార్తలు వినిపించాయి. అమెరికాలో చికిత్సకు వెళ్ళడానికి ఆమె ఈ బ్రేక్ తీసుకుందని, త్వరలోనే ఆమె అమరిక వెళ్లబోతుందని కూడా వార్తలు వినిపించాయి. అయితే.. ఈ బ్రేక్ చికిత్స కోసమే అయినా.. అది ఇలా ప్రకృతిని చూసి ఆస్వాదించడమే అని తెలుస్తోంది. ఆ చికిత్సలో భాగంగానే ఇలా వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుందని టాక్ నడుస్తుంది. కోయంబత్తూర్ లోని ఇషా ఫౌండేషన్ నుంచి తన ట్రిప్ ను మొదలు పెట్టింది సమంత. అక్కడనుంచి రెండు రోజులుకు ముందు మాల్దీవ్స్ లో వాలిపోయింది. తన స్నేహితురాలు అనూష స్వామితో బాలిలో సమయాన్ని గడుపుతుంది.
Nani: రజినీకాంత్ తో నాని.. లక్కీ ఛాన్స్ పట్టేశాడే .. ?
నిత్యం అక్కడ ఉన్న అందాలను, అందమైన ప్రదేశాలను ఫోటోలు రూపంలో అభిమానులకు పరిచయం చేస్తుంది, ఇక తాజాగా ఆమె ఐస్ వాటర్ లో కూర్చున్న వీడియోని షేర్ చేసింది. ‘ఐస్ బాత్స్.. ఫోర్ డిగ్రీస్.. సిక్స్ మినిట్స్’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆరు నిమిషాలు ఆ ఐస్ వాటర్ లో కఠినంగా కూర్చుని ఆ బాధను ఫీలవుతున్నట్టు కనిపించింది. కంటి నుంచి కన్నీరు వస్తున్నా అక్కడ నుంచి కదలకుండా కళ్ళు మూసుకొని ఆరు నిమిషాలు ఫినిష్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఇదొక థెరపీ అని తెలుస్తోంది. సామ్ దాన్ని విజయవంతంగా ఫినిష్ చేసి ఔరా అనిపిస్తుంది. ఏదిఏమైనా ఇలా అయినా సామ్.. తన బాధను మర్చిపోయి ప్రశాంతంగా ఉంటే చాలు అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.
https://www.instagram.com/stories/samantharuthprabhuoffl/3155423899139797622/