Nani:ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి హీరోగా ఎదిగాడు న్యాచురల్ స్టార్ నాని. తెలుగులో హోమ్లీ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఆయన ఈ మధ్య దసరా అనే సినిమా చేసి ఒక మంచి మాస్ హీరో ఇమేజ్ కూడా తెచ్చుకునే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం హాయ్ నాన్న అనే ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్ చేస్తున్న నాని మాస్ కథల మీద దృష్టి పెట్టినట్లు ఈ మధ్య ప్రచారం జరిగింది. వివేక్ ఆత్రేయతో చేయబోతున్న సినిమా సహా ఆయన చేయాలనుకుంటున్న దాదాపు అన్ని ప్రాజెక్టులు మాస్ మసాలా ఎంటర్టైనర్ గా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే అందులో నిజా నిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త తెరమీద కొచ్చింది.
Guntur Kaaram: ‘గుంటూరు కారం’.. ఒకపక్క గొడవలు.. ఇంకోపక్క ప్రమోషన్స్..?
అదేమిటంటే నాని, రజనీకాంత్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఒక కీలక పాత్రలో నటించమని కోరినట్లు తెలుస్తోంది.రజినీకాంత్ ప్రస్తుతం జై భీమ్ లాంటి హిట్ ఇచ్చిన డైరెక్టర్ చేసిన టీజే జ్ఞానవేలు దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించమని నానికి మేకర్స్ నుంచి ఆఫర్ వచ్చినట్లుగా చెబుతున్నారు. రజినీకాంత్ లాంటి స్టార్ హీరోతో చేయడం ఏ కుర్ర హీరోకు అయినా వరం లాంటిది అని చెప్పాలి. ఇక ఎంతోమంది స్టార్ హీరోలకు రజినీ ఒక ఐకాన్ లాంటివాడు. ఇక నాని సైతం ఆ రజినీతో చేయడానికి సుముఖత చూపించినట్లు తెలుస్తోంది. త్వరలోనే డైరెక్టర్- నాని కలిసే అవకాశాలు కూడా ఉన్నాయట.
ఇటీవల తెలుగులో గాడ్ ఫాదర్ సినిమా డైరెక్ట్ చేసిన మోహన్ రాజా, నానితో ఒక సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆయన చెప్పిన ఒక కథ నచ్చకపోవడంతో మరో కథ తీసుకు రమ్మని నాని కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వారంలో నానిని కలిసినందుకు ఈ కోలీవుడ్ డైరెక్టర్లు సిద్ధమవుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.