Samantha In Dialemma About NTR30 Project: NTR30 సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందన్న విషయంపై క్లారిటీ లేదో, అలాగే హీరోయిన్ కూడా ఎవ్వరూ ఫైనల్ అవ్వట్లేదు. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో, తొలుత బాలీవుడ్ కథానాయికని రంగంలోకి దింపాలని అనుకున్నారు. అప్పట్లో ఆలియా భట్‌ని ఎంపిక చేసినట్టు వార్తలు రావడం, అది నిజమేనన్నట్టు ఆలియా పరోక్ష సంకేతాలు ఇవ్వడం జరిగాయి. కానీ, సినిమా వాయిదా వేయడంతో ఆమె తప్పుకున్నట్టు అనధికారిక వార్తలొచ్చాయి. ఆ తర్వాత జాన్వీ కపూర్‌ని సెలెక్ట్ చేయనున్నట్టు పుకార్లు షికారు చేశాయి గానీ, అందులో వాస్తవం లేదని స్వయంగా జాన్వీ స్పష్టం చేసింది.
అనంతరం కథానాయికల రశ్మికా మందణ్న, సమంత, కృతి శెట్టితో పాటు పలువురు హీరోయిన్ల పేర్లు తెరమీదకొచ్చాయి. కొన్నిరోజుల తర్వాత ఎవ్వరూ ఫైనల్ కాలేదని తేలింది. ఇప్పుడు మళ్ళీ సమంత పేరు మార్మోగిపోతోంది. NTR30లో జూ. ఎన్టీఆర్ సరసన సమంతనే హీరోయిన్‌గా తీసుకోవాలని మేకర్స్ నిర్ణయించినట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఆల్రెడీ ఆమెను సంప్రదించారట కూడా! అయితే.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలా? వద్దా? అనే డైలమాలో ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే, ప్రస్తుతం సమంత చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. ముఖ్యంగా.. హిందీలో ఓ సినిమాకి సంతకం చేయడంతో పాటు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ మేకర్స్‌తో మరో వెబ్ సిరీస్‌కి ఒప్పందం కుదుర్చుకుంది. వాటికి బల్క్ డేట్స్ కేటాయించింది.
ఇలాంటి సమయంలో తనకు తారక్ సినిమా ఆఫర్ రావడంతో, డేట్స్ విషయంలో తర్జనభర్జన పడుతోంది. ఆమెకు తారక్ ప్రాజెక్ట్ చేయాలని ఆసక్తి ఉన్నా, డేట్స్ సర్దుబాటు చేయడంలోనే టెన్షన్ పడుతోందట! స్టార్ హీరోతో జోడీ కట్టి చాలాకాలం అవ్వడంతో, తారక్ సినిమా ఎలాగైనా చేయాలని సమంత ధృడ నిశ్చయంతో ఉందని అంటున్నారు. మరి, ఆమె డేట్స్ సర్దుబాటు చేయగలదా? లెట్స్ వెయిట్ అండ్ సీ!