Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ఏం మాట్లాడినా ఓ సెన్సేషన్ అయిపోతుంది. నాగచైతన్య పెళ్లి తర్వాత ఆమె ఏం చేస్తుంది, ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడ ఉంటుందనే విషయాలపై ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ఆరా తీస్తుంటారు. తాజాగా ఆమెకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ముంబైలోని ఓ జిమ్ సెంటర్ నుంచి సమంత బయటకు వస్తుండగా కెమెరామెన్లు ఫొటోలు, వీడియోలు తీశారు. దానిపై సమంత కాస్త సీరియస్ అయింది.
Read Also : Allu Arjun : బన్నీ రిజెక్ట్ చేసిన రెండు భారీ మూవీలు..
వారు వద్దన్నా ఫొటోలు తీయడంపై ‘స్టాప్ ఇట్ గయ్స్’ అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఆ వీడియో ఇప్పుడు చర్చకు దారి తీస్తోంది. అయితే ఈ వీడియోలో సమంతను చూస్తే ఎవరైనా షాక్ అయిపోతారు. ఇందులో ఆమె చాలా సన్నగా కనిపిస్తోంది. ఆమెను చూసిన వారంతా సమంతకు ఏమైందంటూ ఆరా తీస్తున్నారు. సమంత మయోసైటిస్ అనే కండరాల వ్యాధితో మొన్నటి వరకు బాధపడుతూ చికిత్స తీసుకుంది.
రీసెంట్ గా పూర్తిగా కోలుకున్నానంటూ సమంత చెప్పడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషించారు. కానీ ఇంతలోనే ఇంత సన్నగా కనిపించడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. సమంత గతంలో ఎన్నడూ ఇంత సన్నగా కనిపించలేదు. ఆమె ఎందుకు ఇలా మారిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు. దీనిపై సమంత ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.
Read Also : Uppena : ఉప్పెన మూవీని మిస్ చేసుకున్న స్టార్ హీరో