Uppena : బుచ్చిబాబు డైరెక్షన్ లో వచ్చిన ఉప్పెన మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ మూవీతోనే ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్.. తన కెరీర్ కు మంచి పునాది వేసుకున్నాడు. మొదటి సినిమాతోనే ఏకంగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఇందులోని పాటలు, సీన్లు, క్యారెక్టర్లు, డైలాగులు యూత్ ను ఊపేశాయి. అయితే ఈ సినిమాలో ముందుగా వైష్ణవ్ ను హీరోగా అనుకోలేదంట బుచ్చిబాబు. విజయ్ దేవరకొండతో మూవీ చేయాలని అనుకున్నాడంట. పెళ్లి చూపులు సినిమా చూసి విజయ్ కోసం ఈ కథ రాసుకున్నాడంట.
Read Also : Sekhar Kammula : అందుకే ధనుష్ అంటే టెన్షన్.. శేఖర్ కమ్ముల కామెంట్స్‘
కానీ అర్జున్ రెడ్డి మూవీతో ఒక్కసారిగా ఫుల్ మాస్ ఫాలోయింగ్ తెచ్చేసుకున్నాడు విజయ్. కాబట్టి ఆ టైమ్ లో ఇలాంటి లవ్ స్టోరీలో విజయ్ ను చూపించడం కరెక్ట్ కాదనుకున్నాడంట బుచ్చిబాబు. కానీ విజయ్ లాంటి ఫిజిక్ ఉన్న హీరో కావాలనుకున్నాడు. అర్జున్ రెడ్డి లాగా కథను భుజాన వేసుకునే కొత్త నటుడు కావాలని ఎదురు చూశాడు.
అలాంటి టైమ్ లోనే వైష్ణవ్ తేజ్ పేరు బుచ్చిబాబు వద్దకు వెళ్లింది. ఇంకేముంది ఇద్దరూ మూవీ చేయడం.. భారీ హిట్ అయిపోవడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ ఇందులో విజయ్ నటించి ఉంటే ఎలా ఉండేదో. ఏదేమైనా విజయ్ ఓ మంచి సినిమాను మిస్ చేసుకున్నాడనే చెప్పుకోవాలి.
Read Also : Nagarjuna : విలన్ పాత్రల్లో నాగార్జున.. రాంగ్ రూట్ ఎంచుకున్నాడా..?