Samantha: ఇంట్లో కూర్చో.. ఐటెంసాంగ్ చేయకు అన్నారు.. చైతన్యతో విడాకులపై నోరువిప్పిన సామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha: అక్కినేని నట వారసుడు అక్కినేని నాగ చైతన్య, హీరోయిన్ సమంత ఏ మాయ చేశావే చిత్రంతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఈ సినిమా షూటింగ్ లోనే వీరి మధ్య ప్రేమ చిగురించి, పెళ్లి వరకు దారితీసింది. ఎంతో ఘాటుగా ప్రేమించుకున్న ఈ జంట వివాహబంధంలో అడుగుపెట్టారు. ఇక ఈ జంటను చూసి మురిసిపోని అభిమానులు లేరు అంటే అతిశయోక్తి కాదు. మరి.. ఎవరి దిష్టి తగిలిందో ఏమో కానీ, నాలుగేళ్లు కూడా కలిసి ఉండకుండానే ఈ జంట విడాకులు తీసుకోవడం ఇండస్ట్రీలో కలకలం రేపింది. చై- సామ్ మధ్య అసలు వివాదం ఏంటి..? విబేధాలు ఎందుకు వచ్చాయి..? అనేది ఇప్పటివరకు మిస్టరీగానే ఉంది. అయితే కొంతమంది సామ్.. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో చేయడం వలనే విబేధాలు వచ్చాయని, ఇంకొంతమంది సామ్ బిహేవియర్ చై కు నచ్చక విబేధాలు వచ్చాయని పలు రకాల పుకార్లు సృష్టించారు. ఇన్ని పుకార్లలో ఏ ఒక్కటి నిజం కాదని ఇంకొందరు చెప్పుకొచ్చారు. ఇక ఈ పుకార్లు పక్కన పెడితే విడాకుల తరువాత సామ్.. తన కెరీర్ మీద ఫోకస్ పెట్టింది. విడాకులు అయిన కొద్దీ రోజులకే.. పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ కు ఓకే చెప్పి ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే ఇప్పటివరకు ఈ సాంగ్ గురించి కానీ, చై తో విడాకుల గురించి కానీ ఆమె ప్రత్యేక్షంగా మాట్లాడింది లేదు. తాజాగా శాకుంతలం ప్రమోషన్స్ లో భాగంగా ఆమె తన వ్యక్తగత విషయాలను పంచుకుంది.
“పుష్ప సినిమాలోని ఊ అంటావా.. ఊఊ అంటావా సాంగ్.. నేను చైతన్యతో విడిపోయిన కొన్నిరోజులకే వచ్చింది. నేను ఓకే చెప్పగానే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అది చూసిన నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరు .. ఈ సమయంలో ఇంట్లో కూర్చో.. ఇలాంటివి చేయకు.. విడాకుల తర్వాత వెంటనే నువ్వు ఐటెమ్ సాంగ్స్ చేయడం బాగోదు అని సలహాలు ఇచ్చారు. నన్నెప్పుడు సపోర్ట్ చేసే నా ఫ్రెండ్స్ కూడా ఈ సాంగ్ చేయొద్దని చెప్పుకొచ్చారు. అందరిని కాదని ఆ సాంగ్ చేయడానికి నాకు ఒక కారణం ఉంది. నేను నా వైవాహిక జీవితంలో 100 పర్సెంట్ నిజాయితీగా ఉన్నాను. కానీ అది వర్క్ అవుట్ అవ్వలేదు. అలాంటప్పుడు నేనేదో నేరం చేసిన దానిలాగా ఎందుకు దాక్కోవాలి? నేను చేయని నేరానికి నన్ను నేను హింసించుకుని ఎందుకు బాధపడాలి?. అందుకే ఈ సాంగ్ చేశా. ఎన్నో బాధలను అనుభవించాను. నటిగా పర్ఫెక్షన్ గా ఉండాలనుకున్నాను. కానీ, ఈ మయోసైటిస్ బారిన పడ్డాను. కళ్ళు సరిగ్గా కనిపించవు. కళ్లద్దాలు పెట్టుకుంటే ఎవరైనా ఏమన్నా అంటారేమోనని భయం. మెడికేషన్ వలన చాలా బాధను అనుభవించాను. కళ్లతోనే కోటి భావాలు పలికించాలి. కానీ నాకు ఈ పరిస్థితి వచ్చింది.ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి వేరొక నటికి రాకూడదని” సామ్ ఎమోషనల్ అయ్యింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!