Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు సంబంధించిన ఏ చిన్న విషయం అయినా సరే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటుంది. ఆమె చేసే పనులు కూడా అందరి అటెన్షన్ ను తనవైపుకు తిప్పుకుంటాయి. తాజాగా సమంత చేసిన పని అందరినీ అబ్బుర పరిచింది. సమంత సమాజ సేవ చేయడం కోసం ప్రత్యూష ఫౌండేషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ ఫౌండేషన్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేద పిల్లలు, మహిళలకు సాయం చేస్తూ ఉంటుంది. ఇప్పటికీ ఈ ఫౌండేషన్ ద్వారా వందలాది మందికి సాయం చేస్తోంది సమంత.
Read Also : Parineetichopra : తల్లి అయిన స్టార్ హీరోయిన్.. మహేశ్ బాబు హీరోయిన్ ఖుషీ
ఇక ప్రత్యూష ఫౌండేషన్ ఏర్పాటు చేసిన దీపావళి సెలబ్రేషన్స్ లో సమంత పాల్గొంది. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారులతో ఆమె సరదాగా గడిపింది. అందరితో సరదాగా మాట్లాడుతూ వారి బాధలు మర్చిపోయేలా చేసింది. సమంతను చూసిన చిన్నారులు సంతోషంతో మురిసిపోయారు. సమంత కూడా వారిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ఆడిపాడింది. వారితో క్రాకర్స్ కాలుస్తూ దీపావళిని జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సమంత సోషల్ మీడియాలో పోస్టు చేసింది. నిన్న సాయంత్రం అద్భుతంగా జరిగింది. పిల్లలతో ఆనందంగా గడపాను అంటూ తెలిపింది.
Read Also : Pawan Kalyan : పవన్ కల్యాణ్ సినిమాలో నటించను.. కిరణ్ అబ్బవరం కామెంట్స్