Samantha: సమంత.. సమంత.. సమంత.. గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో ఈ పేరు మారుమ్రోగిపోతోంది. ఆమె నటించిన శాకుంతలం ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెల్సిందే. స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్లో 3డీలో రిలీజ్ అవుతోంది.