స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్‌కి రాబోతున్నారు. హెల్త్ ప్రాబ్లం కారణంగా సినిమాలకు కొంత బ్రేక్ ఇచ్చిన సమంత తర్వాత ప్రోడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చి తన ప్రొడక్షన్ హౌస్ ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరిట ‘శుభం’ మూవీతో నిర్మాతగా తన అడుగులు పెట్టి మొదటి చిత్రం తోనే హిట్ అందుకుంది. ఇర ఇప్పుడు మరో ప్రాజెక్ట్ ‘మా ఇంటి బంగారం’తో ఫ్యాన్స్ ముందుకు రాబోతుంది. గతేడాది ఈ మూవీ నుండి విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియోలో సమంత గన్, మెడలో తాళి బొట్టు, రక్తంతో నిండిన ముఖంతో ఫుల్ డ్రామా లుక్‌లో కనిపించారు. ఈ లుక్ చూసిన ఫ్యాన్స్ “ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది?” అని ఎదురు చూసే పరిస్థితి నెలకొంది.
Also Read : Srinidhi Shetty: సూపర్‌స్టార్ కోసం.. డే అండ్ నైట్ షిఫ్ట్స్ అయిన రెడీ
ఆ అప్‌డేట్ కోసం సోషల్ మీడియా ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు “ఈ నెలలోనే ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ ప్రారంభం అవుతుంది” అంటూ సమంత స్వయంగా తెలిపారు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్. చాలా రోజుల తర్వాత సమంతను మళ్లీ స్క్రీన్‌లో చూడబోతున్నాం అంటూ మురిసి పోతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ వార్త ట్రెండ్ అవుతోంది.
"#MaaIntiBangaram Finally starting this month"
~ @Samanthaprabhu2! 🛐❤️🔗 https://t.co/XDLeCResDo #Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/kmWRvfaQDB
— Samantha FC || TWTS™ (@Teamtwts2) October 5, 2025