Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది. ఇక ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నా లేకుండా కూడా ట్రెండింగ్ లో మాత్రం సామ్ పేరు మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఇక ఆమె వైరల్ గా ఉండడానికి కారణం అక్కినేని వారబ్బాయి నాగ చైతన్య. నాలుగేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంట నాలుగేళ్లు కూడా కలిసి ఉండలేక విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక వీరి విడాకులకు పలురకాల కారణాలు వింటూనే ఉన్నాం.. కానీ, ఇప్పటివరకు అసలు కారణం ఏంటి అనేది ఎవరికి తెలియదు.. ఎవరికి తోచింది వారు చెప్పుకుంటున్నారు కానీ దీనిపై సామ్ కానీ, చైతూ కానీ నోరు విప్పింది లేదు.
ఇక తాజాగా మరోసారి సామ్ విడాకులకు కారణం ఇదేనంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే సామ్ సర్జరీ కోసం అమెరికా వెళ్లిందని వార్తలు వచ్చిన విషయం విదితమే.. ఇక అక్కడ నాగ చైతన్య తల్లిని కలిసి ముచ్చటించినట్లు సమాచారం. కొడుకు తనను టార్చర్ చేసినరట్లు, అందుకే తాను విడాకులు తీసుకున్నట్లు చెప్పుకొచ్చిందంట. పెళ్లి తరువాత చైతూ మారిపోయాడని, తనను కంట్రోల్ చేస్తున్నట్లు తెలిపిందట. ఆ సినిమా చేయొద్దు.. ఈ డ్రెస్ వేసుకోవద్దు.. వీరితో మాట్లాడవద్దని బెదిరిస్తున్నాడని, దాని వలన తన ఫ్రీడమ్ పోతుందని సామ్, చైతూతో గొడవలు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చిందట. అంతేకాకుండా ఎన్ని రోజులు మాట్లాడకపోయినా చైతూ పట్టించుకొనేవాడు కాదని, అక్కినేని ఫ్యామిలీ కూడా అతనికే సపోర్ట్ చేయడంతో తన ఆత్మాభిమానాన్ని చంపుకోలేక విడాకులు తీసుకున్నానని అత్తతో చెప్పి బాధపడిందట సామ్. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియదు కానీ మరోసారి సామ్- చై విడాకుల ప్రస్తావన మాత్రం వైరల్ గా మారింది.