అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకులు తీసుకొని విడిపోయాక ఎవరి బిజీ లైఫ్ లో వారు గడుపుతున్నారు. ఇద్దరు పలు ప్రాజెక్టలలో తలమునకలవుతూ తిరుగుతున్నారు. సమంత కనీసం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండగా .. చైతూ ఎప్పటిలానే సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇక విడాకుల తరువాత వీరిద్దరూ ఇటీవల కలిశారు. అయితే అది కేవలం షూటింగ్ నిమిత్తం మాత్రమే. ప్రస్తుతం సామ్ నటిస్తున్న యశోద ఆఖరి షెడ్యూల్, చై నటిస్తున్న బంగార్రాజు ఆఖరి షెడ్యూల్ రెండు రామానాయుడు స్టూడియోలోనే జరుగుతుండగా వీరిద్దరూ ఆ షూటింగ్లకు హాజరయ్యారు. అక్కడే వీరిద్దరూ కలవడం జరిగింది. అయితే ఒకే చోట ఉన్న కూడా ఎదురెదురు పడకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారట ఈ జంట.
ముందే తమ సిబ్బందికి జాగ్రత్తలు చెప్పి సామ్ ని చై కంట పడకుండా , చైతు సామ్ ని చూడకుండా చేయాలనీ ఆదేశాలు ఇచ్చారంట. అయినా వెళ్ళేటప్పుడు ఇద్దరు ఎదురెదురు అయినా ఒకరి ముఖం ఒకరు చేసుకోకుండానే వెనుతిరిగినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ప్రేమలో ఉన్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు హాట్ టాపిక్ గా మారినా ఈ జంట.. విడిపోయాక కూడా హాట్ టాపిక్ గానే మారడం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు నొక్కివక్కాణిస్తున్నారు.