Samajavaragamana Collections: శ్రీ విష్ణు హీరోగా – రామ్ అబ్బరాజు తెరకెక్కించిన కామెడీ మూవీ ‘సామజవరగమన’ గత నెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెబా మోనికా జాన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నరేష, శ్రీకాంత్ అయ్యంగార్, సుదర్శన్, రాజీవ్ కనకాల ఇతర కీలక పాత్రలలో నటించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్యా మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, అనిల్ సుంకర నిర్మించిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ‘సామజవరగమన’మూవీకు తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజు కూడా అదిరే రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు రిలీజైన మొదటి రోజు కంటే ఈ సినిమాకి 11వ రోజు ఎక్కువ వసూళ్లు రావడం గమనార్హం.
Viraj Ashwin: మా సినిమాకు చాలా మంది హీరోలు ఉన్నారు!
ఈ క్రమంలో నైజాంలో రూ. 38 లక్షలు, సీడెడ్‌లో రూ. 7 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 8 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, గుంటూరులో రూ. 8 లక్షలు, కృష్ణాలో రూ. 9 లక్షలు, నెల్లూరులో రూ. 4 లక్షలతో రూ. 93 లక్షలు షేర్, రూ. 1.75 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. 11 రోజుల్లో నైజాంలో రూ. 3.37 కోట్లు, సీడెడ్‌లో రూ. 97 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 1.15 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 61 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 43 లక్షలు, గుంటూరులో రూ. 58 లక్షలు, కృష్ణాలో రూ. 61 లక్షలు, నెల్లూరులో రూ. 33 లక్షలతో.. రూ. 8.05 కోట్లు షేర్, రూ. 14.80 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. 11 రోజుల్లోనే ‘సామజవరగమన’ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 11.60 కోట్లు షేర్‌తో పాటు రూ. 22.85 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా హిట్ అవడమే కాదు 8.10 కోట్లు లాభాలతో దూసుకు పోతోంది.