Viraj Ashwin: మా సినిమాకు చాలా మంది హీరోలు ఉన్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Baby Movie Hero Viraj Ashwin Special Interview: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన బేబీ మూవీ జూలై 14న విడుదల కాబోతోంది. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డు సినిమా ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సినిమా మీద అంచనాలు పెంచాయి. ఇక ఈ నేపథ్యంలో హీరో విరాజ్ అశ్విన్ మీడియాతో ముచ్చటిస్తూ పలు ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నారు.
ఈ సినిమాలో మీ పాత్ర ఏంటి?
– ‘’బేబీ సినిమాలో నా పాత్ర పేరు విరాజ్, తొలిసారి నా రియల్ నేమ్ క్యారెక్టర్ చేస్తుండటం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో ఆనంద్, వైష్ణవి పత్రాలు అలాగే నా పాత్ర చాలా సహజంగా ఉంటాయి. రియల్ వరల్డ్ తో కనెక్ట్ అయినట్లు బిహేవ్ చేస్తుంటాయి, నేను కాలేజ్ స్టూడెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. జీవితం గురించి ఏమీ తెలియని ఓ కుర్రాడిగా యంగ్ అండ్ ఎనర్జిటిక్ గా కనిపిస్తా’’.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్‌ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్‌కు ఫ్యాన్స్‌కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
బేబీ గురించి చెప్పాలంటే?
– ‘’దర్శకుడు సాయి రాజేష్ ప్రతి చిన్న విషయాన్నీ చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు. ప్రతి క్యారెక్టర్ కి ఒక బ్యాక్ స్టోరి చెప్పడంతో నా క్యారెక్టర్ అలా ఎందుకు బిహేవ్ చేస్తుంది అనేది తెలిసిపోయి యాక్టింగ్ ఈజీ అయ్యింది. ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణ అవుతాయి’’.
టెక్నీకల్ పీపుల్ గురించి చెప్పమంటే
– ‘’ఎంఎన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ కొత్త టోన్ ఇచ్చింది, విజువల్ గా బ్యూటీ ఉంటుంది. ఎలాంటి సీన్స్ అయినా కొత్త కలర్ కనిపిస్తుంది, అలాగే విజయ్ బుల్గేనిన్ మ్యూజిక్ హైలెట్ గా నిలుస్తుంది. ఈ సినిమాకు విప్లవ్ ఎడిటింగ్ కూడా క్రిస్పీ నెస్ తెచ్చింది, చాలా షార్ప్ గా ప్లెజంట్ వేలో ఎడిట్ చేశారు’’.
ఇందులో హీరో మీరా? ఆనందా?
– ‘’మీరు ట్రైలర్ లో చూసినట్లు ఒక అమ్మాయి స్కూల్ డేస్ లో ఆనంద్ ను ప్రేమిస్తుంది, అలాగే కాలేజ్ లో నేను తనను లవ్ చేస్తాను’’ ఇలా క్యారెక్టర్స్ పరంగా హీరోయిజం, ప్రాధాన్యత ఉంటుంది కానీ వాళ్ళు హీరో వీళ్ళు హీరో అనేది సెపరేట్ గా ఉండదు. మా సినిమాకు చాలా మంది హీరోలు ఉన్నారు.- నా సినిమాల్లో ప్రాపర్ గా థియేటర్ రిలీజ్ కు వస్తున్న సినిమా ఇది, సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి యాక్టింగ్ కు స్కోప్ ఉంటుంది. నా క్యారెక్టర్ కు కూడా యాక్టింగ్ స్కోప్ బాగుంది’’.
వైష్ణవి గురించి చెప్తారా?
– ‘’వైష్ణవి తన క్యారెక్టర్ లో చాలా బాగా నటించింది, ఆమెకు ఓటీటీల్లో నటించిన ఎక్స్పీరియన్స్ ఉంది. అయినా ఇలాంటి పెద్ద సినిమాను తన భుజాలపై వేసుకుని చేసింది, ఎందుకంటే సినిమా అంతా తన చుట్టూ రిలేట్ అయి ఉంటుంది. వైష్ణవి బేబీ హీరోయిన్ గా పర్ఫెక్ట్ ఛాయిస్ అనుకోవచ్చు’’.
ఇది లవ్ స్టోరీనా?
– ‘’రిచ్ అయినా పూర్ అయినా కాలేజ్ డేస్ లో స్టూడెంట్స్ లో ఒక రెబలిజం ఉంటుంది. నాదే ప్రపంచం అనే భావన ఉంటుంది. నేను ఫీల్ కు రిలేట్ అయ్యాను. ఈ సినిమాలో ప్రేమను పెయిన్ ద్వారా చూపించాం అందుకే ఇదొక ఎమోషనల్ లవ్ స్టోరీ అనుకుంటున్నారు’’.
సినిమా కధ కొత్తగా అనిపించడం లేదే?
– నేను చూసిన లవ్ స్టోరీస్ తో పోల్చితో ఇదొక ఫ్రెష్ అప్రోచ్ ప్రేమ కథ అనుకుంటాను, ట్రయాంగిల్ లవ్ స్టోరీ అయినా రెగ్యులర్ గా, రొటీన్ గా ఉండదు. ప్రతి టెక్నీషియన్ సినిమా కథను ఎంత బాగా ప్రెజెంట్ చేయాలో అంత బాగా ప్రెజెంట్ చేశారు. ముఖ్యంగా ఎస్కేఎన్ పర్పెక్ట్ ప్రొడ్యూసర్ అనిపిస్తుంటుంది. ఇక నేను ఇప్పుడు మంచి కాన్సెప్ట్ ఉన్న మూవీస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ప్రస్తుతం మరీచిక అనే మూవీ చేస్తున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!