దక్షిణాది సినిమాలు అంటే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల్లో ఎక్కువ భాగం రీమేక్ సినిమాలే కావడం విశేషం. తాజాగా సల్మాన్ ఖాన్ మరో టాలీవుడ్ సినిమాపై కన్నేసారు. అయితే ఈసారి ఏకంగా సెట్స్ పై ఉన్న సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో పడ్డారట. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడి’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను బాలీవుడ్‌కు చెందిన పెన్ స్టూడియోస్ నిర్మిస్తోంది. దీంతో సల్మాన్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని సమాచారం. అంతేకాదు ‘ఖిలాడి’ హిందీ రీమేక్ ను కూడా రమేష్ వర్మనే చేయనున్నాడని తెలుస్తోంది. కాగా సల్మాన్ గతంలో రవితేజ ‘కిక్’ మూవీని బాలీవుడ్ లో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.