Salman Khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఏ.ఆర్.మురుగదాస్ డైరెక్షన్ లో వస్తున్న సినిమా సికందర్. చాలా కాలం తర్వాత మురుగదాస్ నుంచి వస్తున్న సినిమా ఇది. పైగా సల్మాన్ ఖాన్ చాలా ఏళ్ల తర్వాత ఒక సౌత్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు. అందుకే ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్లు, పోస్టర్లు ఆకట్టుకున్నాయి. మార్చి 30న రిలీజ్ కాబోతున్న మూవీ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. సత్యరాజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
Read Also : Meerut Murder: భర్తని చంపిన భార్యకు సాయం నిరాకరించిన కుటుంబం.. ప్రభుత్వ లాయర్ కోసం విజ్ఞప్తి
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది వింటేజ్ సల్మాన్ ఖాన్ ను గుర్తు చేస్తోంది. ఇందులో ఆయన యంగ్ గా మాస్ లుక్ లో మెరుస్తున్నారు. ఫుల్ లెంగ్త్ యాక్షన్ సీన్లతో ట్రైలర్ ను నింపేశారు. అటు మాస్ సీన్లతో పాటు కొన్ని రొమాంటిక్ లవ్ సీన్లను కూడా ఇందులో చూపించాడు మురుగదాస్. ఆయన మార్క్ ఇందులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పెద్దగా వీఎఫ్ ఎక్స్ జోలికి పోకుండా రియాల్టీకి దగ్గరగా ట్రైలర్ ను కట్ చేయించారు. ఈ ట్రైలర్ చాలా రోజుల తర్వాత వింటేజ్ సల్మాన్ ఖాన్ ను గుర్తు చేస్తోందని చెబుతున్నారు.