Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Salman Khan Revealed Why He Accepted Godfather Movie

Salman Khan: గాడ్‌ఫాదర్‌.. డీల్ వెనుక సల్మాన్ రివీల్ చేసిన సీక్రెట్

Published Date :October 1, 2022 , 11:13 pm
By NTV WebDesk
Salman Khan: గాడ్‌ఫాదర్‌.. డీల్ వెనుక సల్మాన్ రివీల్ చేసిన సీక్రెట్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Salman Khan Revealed Why He Accepted Godfather Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందిన ‘గాడ్‌ఫాదర్’ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ఓ అతిథి పాత్ర పోషించిన విషయం తెలిసిందే! ఈ పాత్ర ఒప్పుకోవడానికి గల కారణాలేంటో.. ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా తాజాగా నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో సల్మాన్ చెప్పుకొచ్చాడు. సినిమాల పట్ల చిరంజీవికి ఉన్న ప్రేమ, తమ మధ్య ఉన్న అనుబంధం వల్లే.. తాను ఇందులో నటించేందుకు ఒప్పుకున్నానన్నాడు. చిరు ఈ సినిమా గురించి చెప్పగానే, తాను మరో ఆలోచన చేయకుండానే ఓకే చెప్పానన్నాడు. మీ వెనకాల నిల్చోడానికి కూడా నేను సిద్ధమేనని అన్నానని, నీకు మంచి పాత్రే ఇస్తానని చిరు చెప్పారని.. ఆయన చెప్పినట్టుగానే తనకు ఈ సినిమాలో మంచి రోల్ ఇచ్చారని సల్మాన్ తెలిపాడు. ఈ చిత్రంలో తానో కొత్త పాత్ర చేశానన్న సల్మాన్.. మల్టీస్టారర్లు చేయడానికి కూడా సిద్ధమేనన్నాడు.

ఇదే సమయంలో సల్మాన్.. తనకు, చిరుకి మధ్య ఉన్న బాండింగ్ గురించి చెప్తూ, ‘కాస్టింగ్ కౌచ్‌’ని వాడుకున్నాడు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉండదని ఎవరు చెప్పారు.. కాస్టింగ్ కౌచ్ ముమ్మాటికీ ఉందని అన్నాడు. అందుకు తన స్టోరీనే ఉదాహరణగా తెలిపాడు. థాయిలాండ్‌లో తాము ఒక కమర్షియల్ యాడ్ చేసిన తర్వాత ముంబైకి తిరిగొచ్చామని.. చిరంజీవికి ఉదయం హైదరాబాద్‌కి ఫ్లైట్ ఉండటంతో కాసేపు కూర్చొని మాట్లాడుకున్నామని చెప్పాడు. అనంతరం తన బెడ్‌రూంలో వెళ్లి పడుకోమని తాను చిరుకి చెప్తే.. ఆయన మాత్రం కౌచ్ మీదే నిద్రపోతానని పట్టుపట్టారని అన్నాడు. నిజానికి.. తనకు కౌచ్ మీద పడుకోవాలని ఉన్నప్పటికీ, చిరు మాటని కాదనలేక సరేనన్నానని తెలిపాడు. అలా తాను బెడ్‌రూంకి వెళ్లి నిద్రపోగా.. చిరు కౌచ్‌పై పడుకున్నారని అన్నాడు. అలా నేను ఈ సినిమాలో భాగమయ్యానంటూ సల్మాన్ సరదాగా చెప్పుకొచ్చాడు. జనాలు ఇప్పుడు సినిమాల్ని నార్త్, సౌత్ అని తేడా లేకుండా చూస్తున్నారన్నాడు. గాడ్‌ఫాదర్ తన తొలి తెలుగు సినిమా అని పేర్కొన్న సల్మాన్.. ఇది కచ్ఛితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్మకంగా చెప్పాడు.

ఇక ఈ ఈవెంట్‌లోనే చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘గాడ్‌ఫాదర్‌లో ఒక బలమైన పాత్ర వుంది. లూసిఫర్‌లో ఆ పాత్రని పృథ్వీరాజ్ సుకుమారన్ చేశారు. గాడ్‌ఫాదర్‌లో ఈ పాత్రని సల్మాన్ భాయ్ చేస్తే బావుంటుందని భావించాం. మేము కోరగానే ‘నేను చేయాలని మీరు కోరినట్లయితే, మరో ఆలోచన లేకుండా చేస్తాను. మీరు ఇంకెం అలోచించకండి. నేను చేస్తాను’ అని మాపై ఎంతో ప్రేమ చూపించారు సల్మాన్ భాయ్. సల్మాన్ భాయ్ ఓకే చేసిన తర్వాత ఈ సినిమా మరింత ప్రత్యేకత వచ్చిపడింది. షూటింగ్‌లో మాకు ఎంతగానో సహకరించారు. సల్మాన్ భాయ్ గాడ్ ఫాదర్‌లోకి రావడం.. ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని చెప్పడానికి తొలిమెట్టు. మాపై ఎంతో ప్రేమ, ఆప్యాయతతో ఈ సినిమా చేశారు. సల్మాన్ భాయ్‌తో కలసి ఈ సినిమాని చాలా జోష్ ఫుల్ గా చేశాను. ఆ జోష్‌ని తెరపై చూస్తారు’’ అంటూ చెప్పుకొచ్చారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi
  • GodFather
  • Mohan Raja
  • Ram Charan
  • Salman Khan

తాజావార్తలు

  • MP Putta Mahesh: షోకాజ్ నోటీసుకి సమాధానం ఇచ్చిన ఎంపీ పుట్టా మహేష్‌.. టీడీపీ అధిష్టానం చర్యలపై ఉత్కంఠ..!

  • IPL Orange Cap: కోహ్లీ, రోహిత్ శర్మ కాదు.. ఈ స్టార్ ప్లేయరే ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ ‘కింగ్’..!

  • Sri Lanka Refuses US Military Aircraft Landing: అమెరికా యుద్ధ విమానాలు దిగేందుకు నో చెప్పిన శ్రీలంక..

  • Iran War: ఇరాన్‌కు రూ.18 కోట్లు చెల్లించి.. హర్మూజ్ జలసంధిని దాటిన చమురు నౌక..

  • Virosh: పెళ్ళికి పిలవలేదని రీల్ చేసిన చిన్నారి.. ఇంటికి పిలిపించుకుని షాకిచ్చిన దేవరకొండ దంపతులు

ట్రెండింగ్‌

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions