2018లో రిలీజైన ఎన్టీఆర్ మూవీ అరవింద సమేత వీరరాఘవ సినిమా సీడెడ్ లో ఓపెనింగ్ డే రోజున హ్యూజ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ రికార్డ్స్ ని పాన్ ఇండియా సినిమాలు కూడా బ్రేక్ చేయడానికి కూడా ట్రై చేసాయి కానీ వర్కౌట్ అవ్వలేదు. అయితే 2019 జనవరి 11న రిలీజైన వినయ విధేయ రామ సినిమా డే 1 అరవింద సమేత వీరరాఘవ సినిమా ఓపెనింగ్ డే రికార్డుని బ్రేక్ చేసింది అనే టాక్ ఉంది. రామ్ చరణ్-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ హైప్ తో రిలీజ్ అయ్యింది. ఓపెనింగ్స్ బాగున్నా టాక్ బాగోలేకపోవడంతో వినయ విధేయ రామ సినిమా బాక్సాఫీస్ దగ్గర నష్టాలు మిగిలించింది. ఓపెనింగ్స్ విషయంలో మాత్రం ఈ సినిమా సీడెడ్ ఏరియాలో మొదటి రోజు ఏడున్నర కోట్లని రాబట్టింది. 2024 సంక్రాంతి వస్తే చరణ్ సీడెడ్ గడ్డపై బెంచ్ మార్క్ కలెక్షన్స్ ని రాబట్టి నాలుగేళ్లు అవుతుంది.
ఈ నాలుగేళ్ల గ్యాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి కానీ వినయ విధేయ రామ ఓపెనింగ్ డే రికార్డుని బ్రేక్ చేయలేకపోయాయి. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత రేపు ఈ రికార్డ్ బ్రేక్ అయ్యేలా కనిపిస్తోంది. సలార్ సినిమాతో ప్రభాస్ వినయ విధేయ రామ సీడెడ్ ఓపెనింగ్ డే రికార్డుని బ్రేక్ చేయడానికి రెడీ అయ్యాడు. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్… మాస్ సినిమా… హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్స్… భారీ రిలీజ్… ఇవ్వన్నీ కలిసి సలార్ సినిమా అన్ని సెంటర్స్ లో కొత్త రికార్డులు క్రియేట్ చేసేలా చేస్తున్నాయి. సీడెడ్ ఏరియాలో కూడా సలార్ మూవీ కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తే అది బ్రేక్ అవ్వడానికి చాలా రోజులే పడుతుంది. మరి ఓపెనింగ్ డే సీడెడ్ ఏరియాలో ప్రభాస్ సలార్ సినిమాతో ఎంత కలెక్ట్ చేస్తాడు అనేది చూడాలి.