ప్రభాస్ కి కింగ్ సైజ్ కంబ్యాక్ ఇస్తూ వరల్డ్ వైడ్ దాదాపు 800 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది సలార్ సీజ్ ఫైర్. డే వన్ 178 కోట్లు రాబట్టి ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టిన సలార్ సినిమా ప్రభాస్ కటౌట్ ని కరెక్ట్ గా వాడుకుంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చూపించింది. డిసెంబర్ 22న రిలీజైన ఈ మూవీ నెల రోజులు తిరగకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. సంక్రాంతి సినిమాల జోష్ తగ్గి మళ్లీ సలార్ సీజ్ ఫైర్ సినిమాకి థియేటర్స్ ఇస్తారు అనే మాట వినిపిస్తున్న సమయంలో సడన్ గా సలార్ సినిమా ఓటీటీలోకి వచ్చేయడం ఆశ్చర్యం కలిగించే విషయం. నెట్ ఫ్లిక్స్ లో సలార్ సినిమా స్ట్రీమ్ అవుతోంది, దీంతో థియేటర్స్ లో మిస్ అయిన వాళ్లు… ఆల్రెడీ చూసిన వాళ్లు సలార్ ని రిపీట్ వేస్తున్నారు. కాటేరమ్మ కొడుకు వచ్చాడు అంటూ సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ వీడియోస్ తో హల్చల్ చేస్తున్నారు.
థియేటర్ లో సినిమా చూసినప్పుడు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో రవి బాసూర్ KGF రేంజ్ స్కోర్ కొట్టలేదు అనే కామెంట్స్ వినిపించాయి. ఓటీటీలో సినిమా చూసిన వాళ్లు మాత్రం రవి బసూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది అంటున్నారు. అయితే అసలు థియేట్రికల్ రన్ ఇంకా కంప్లీట్ చేసుకోని సినిమాని అప్పుడే ఓటీటీలోకి ఎందుకు వదిలేసారు అనేది మేకర్స్ కి మాత్రమే తెలియాలి. కేవలం 28 రోజుల్లో పాన్ ఇండియా రేంజులో హిట్ అయిన సినిమాని ఎందుకు స్ట్రీమింగ్ కి ఇచ్చారు అనే విషయం ప్రభాస్ అభిమానులకి కూడా అంతుబట్టట్లేదు. సలార్ కన్నా ముందు రిలీజైన అనిమల్ మూవీ ఇంకా ఓటీటీలోకి రాలేదు కానీ సలార్ వచ్చేసింది.