Salaar: ‘సలార్’ వల్ల కొత్త తలనొప్పి… ఆ సినిమాలన్నీ వెనక్కేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సాలిడ్ కంబ్యాక్ అయ్యే సినిమా ‘సలార్’ అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు ప్రభాస్ ఫ్యాన్స్. కెజియఫ్ చాప్టర్ 2 చూసిన తర్వాత… ప్రశాంత్ నీల్ తమ హీరోకి ఇచ్చే ఎలివేషన్ ఎలా ఉంటుందోనని… ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవడం లేదు. అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. వచ్చే వారంలో బాక్సాఫీస్ బద్దలై ఉండేది కానీ సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్‌పోన్ అయిపోయింది సలార్. ఇంకా కొత్త రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయడం లేదు మేకర్స్. నవంబర్, డిసెంబర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే.. ఇలా అన్నింటిని సలార్ టార్గెట్ చేసిందని ప్రచారం జరుగుతోంది కానీ క్లారిటీ రావడం లేదు. ఇదే ఇప్పుడు మిగతా హీరోలకు తలనొప్పిగా మారింది.
Read Also: Prabhas: ‘కల్కి’ సీరియస్ వార్నింగ్!
Also Read
- Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడి క్లాసిక్ లవ్ స్టోరీ.. నాని జోడిగా రుక్మిణి వసంత్.?
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
ఇప్పటికే పక్కా ప్లానింగ్‌తో నవంబర్, డిసెంబర్, సంక్రాంతికి రిలీజ్ అయ్యేలా తమ తమ సినిమాల డేట్స్‌లను లాక్ చేసుకున్నారు మేకర్స్. ఒకవేళ తాము అనుకున్న తేదీల్లో సలార్ రిలీజ్ అయితే.. మరో కొత్త డేట్‌ను వెతుక్కోవాల్సిందే. ముఖ్యంగా సంక్రాంతి సీజన్‌ను సలార్ టార్గెట్ చేస్తే.. మిగతా సినిమాల పరిస్థితేంటి? అనేది తేలడం లేదు. ఇదే నిజమైతే… డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలకు కొత్త తలనొప్పులు తప్పవు. ముఖ్యంగా సలార్‌ను నమ్ముకొని బిజినెస్ చేసిన వారికి ఇది మరింత తలనొప్పిగా మారుతోంది. హోంబలే ఫిలింస్ నుంచి క్లారిటీ కావాలంటూ… వాళ్లు కాస్త గట్టిగానే డిమాండ్ చేస్తున్నారట. అయినా కూడా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదట కానీ సోషల్ మీడియా బజ్ ప్రకారం.. డిసెంబర్ లేదా కల్కి ప్లేస్‌లో సంక్రాంతికి సలార్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Muhammad Yunus: “నువ్వు ఒక ఉగ్రవాదివి, వేలాది మందిని చంపావు”.. ముహమ్మద్ యూనస్‌కు చేదు అనుభవం..
-
Maharashtra: మహారాష్ట్రలో వాటర్ ఎమర్జెన్సీ.. నీళ్లు వృథా చేస్తే రూ.5 వేల జరిమానా, కేసులు!
-
Rahul Gandhi: పరువు నష్టం కేసు.. సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్..
-
Buddha Prasad: జనసేన లేకుండా.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండా ఎగురదు!
ట్రెండింగ్
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!