Prabhas: ‘కల్కి’ సీరియస్ వార్నింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం బడా బడా మూవీ మేకర్స్‌ను సైతం భయపెడుతున్న సమస్య ‘లీకులు’. శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ కూడా లీకులకు బేంబేలెత్తిపోతున్నాడు. స్టార్టింగ్ నుంచి ‘గేమ్ చేంజర్’ సినిమా వరుసగా లీకుల బారిన పడుతోంది. రీసెంట్గా ‘జరగండి’ అనే సాంగ్ లీక్ అయి మేకర్స్‌కు షాక్ ఇచ్చింది. అలాగే ప్రభాస్ నటిస్తున్న ‘కల్కి’ సినిమాను కూడా లీకులు వదలడం లేదు. ఎవరు చేస్తున్నారు? ఎక్కడి నుంచి లీక్ అవుతుందనే విషయం తెలియక తల పట్టకుంటున్నారు మేకర్స్. రీసెంట్గా ‘కల్కి’ నుంచి ఓ పిక్ ఒకటి బయటకొచ్చి వైరల్‌గా మారింది. ‘కల్కి’ మూవీ వీఎఫ్ఎక్స్ వర్క్ చేస్తున్న కంపెనీ నుంచే ఈ లీక్ జరిగినట్లు తెలియడంతో… సదరు వ్యక్తిపై యాక్షన్ తీసుకున్నారు.
నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ వారైతే ఏకంగా ఆ వ్యక్తిపై క్రిమినల్ కేసు పెట్టారని, విఎఫ్ఎక్స్ కంపెనీపై పరువు నష్టం దావా వేశారని వార్తలొచ్చాయి కానీ ఇప్పుడు అఫిషీయల్‌గా లీగల్ కాపీ రైట్ నోటీస్ రిలీజ్ చేశారు వైజయంతీ వారు. Legal Copyright Notice : #VyjayanthiMovies wishes to inform the public that #Kalki2898AD and all its components are protected by copyright laws. Sharing any part of the film, be it scenes, footage or images, is illegal and punishable. Legal action will be taken as needed, with the assistance of Cyber Police.. అంటూ నోట్ రిలీజ్ చేశారు. కల్కి సినిమా నుంచి ఎలాంటీ లీకులు చేసినా.. ఆ ఫోటోలు, ఫుటేజ్‌లను అనధికారికంగా ఎవరైనా షేర్ చేసినా.. కాపీరైట్ చట్టాల ద్వారా యాక్షన్ తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అవసరమైతే… సైబర్ పోలీసుల సహకారంతో చట్టపరమైన చర్యలు తీసుకుంటాం… అని సీరియస్‌గా చెప్పుకొచ్చారు. మరి ఇప్పటికైనా కల్కి లీకులు ఆగుతాయేమో చూడాలి.
Also Read
- The Traitors Telugu: "ది ట్రైటర్స్" తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
- Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
- Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత!
- Renu Desai: 14 ఏళ్లుగా ఇదే పరిస్థితి.. నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?
Legal Copyright Notice : #VyjayanthiMovies wishes to inform the public that #Kalki2898AD and all its components are protected by copyright laws. Sharing any part of the film, be it scenes, footage or images, is illegal and punishable. Legal action will be taken as needed, with… pic.twitter.com/wc3rRfRuDJ
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) September 21, 2023
తాజావార్తలు
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Measles: గాల్లో వైరస్..30ఏళ్ల తర్వాత అదే ముప్పు!
-
Basil Joseph: ఆఫర్స్ లేక కాదు.. కావాలనే యాక్టింగ్‌కు బ్రేక్.. బాసిల్ పెద్ద ప్లానే!
-
Minister Anam Ramanarayana Reddy: విక్రమ్ రెడ్డిపై మంత్రి ఆనం తీవ్ర వ్యాఖ్యలు.. నా జోలికొస్తే ఆకు చించి విస్తరాకు చేస్తా!
-
Vijay Sethupathi: విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత!
ట్రెండింగ్
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!