Salaar: ఈ యాక్షన్ ఎపిక్ అనౌన్స్ అయ్యి రెండేళ్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేవలం అనౌన్స్మెంట్ తోనే ఇండియాని షేక్ చేసిన సినిమా ఏదైనా ఉందా అంటే అది ‘సలార్’మాత్రమే. KGF సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. “An Action Saga #Salaar అంటూ ప్రభాస్ ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేసిన ప్రశాంత్ నీల్, మోస్ట్ వయోలెంట్ మాన్ అంటూ రచ్చ చేశాడు. ప్రభాస్ గన్ను పట్టుకున్న పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేసింది. అప్పటివరకూ ఒక సినిమా అనౌన్స్మెంట్ ఇండియాలోనే హాట్ టాపిక్ అవ్వడం అదే మొదటిసారి. ఈ అనౌన్స్మెంట్ వచ్చి నేటికి రెండేళ్లు అవుతుంది. 2020 డిసెంబర్ 02న ‘సలార్’ అనౌన్స్మెంట్ బయటకి వచ్చింది. అప్పటినుంచి ఇప్పటివరకూ రెండేళ్లుగా అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా అలానే మైంటైన్ చేస్తున్న ఈ మూవీ గురించి గత రెండేళ్లలో అఫీషియల్ గా వచ్చిన వార్తలు ఏంటో చూద్దాం.
రెండేళ్ల క్రితం డిసెంబర్ 2న అనౌన్స్ అయిన ‘సలార్’, జనవరి 15న పూజా కార్యక్రమాలు జరుపుకోని గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈ పూజా కార్యక్రమాలకి ‘రాకీ భాయ్’ కూడా రావడం విశేషం. ఇది జరిగిన నెలన్నరకి 2021 ఫిబ్రవరి 28న సలార్ సినిమాని 2022 ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నాం అంటూ హోంబలే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. దీంతో పాన్ ఇండియా సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది అంటూ ప్రభాస్ ఫాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. 2021 ఆగస్ట్ 23న సలార్ సినిమాలో విలన్ గా జగపతిబాబు నటిస్తున్నాడు, ఆయన పాత్ర పేరు ‘రాజమన్నార్’ అంటూ ఒక పోస్టర్ బయటకి వచ్చింది. ఈ పోస్టర్ లో జగపతిబాబు లుక్ చూస్తే ప్రభాస్ కి పర్ఫెక్ట్ విలన్ దొరికాడు అనిపించకమానదు. 2021 ఆగస్ట్ నుంచి 2022 జనవరి వరకూ సలార్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు.
Also Read
- Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
- Srinidhi Shetty: ఆ ఛాన్స్ ఎలా వచ్చిందో నాకే తెలీదు
- Aadarsha Kutumbam Trailer: 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్లో వెంకీ మామ వైలెంట్ అవతార్ చూశారా!
- Thaman: త్రివిక్రమ్ వల్లే 'ఓజీ' సాధ్యమైంది: మ్యూజిక్ డైరెక్టర్ తమన్
శృతి హాసన్ పుట్టినరోజు సంధర్భంగా 2022 జనవరి 28న సలార్ నుంచి ఒక పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో శృతి హాసన్ ‘ఆద్యా’గా కనిపించనుందని ఆమె ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. మే 17న ‘సలార్’ అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని అనౌన్స్ చేశారు. మే 18న ప్రశాంత్ నీల్ ఒక భారి యాక్షన్ ఎపిసోడ్ ని రెడీ అవుతున్నాడు అంటూ మేకింగ్ వీడియో బయటకి వచ్చి నెట్ లో హల్చల్ చేసింది. జూన్ 4న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు కావడంతో, రెండు ఫోటోలని పోస్ట్ చేసి ప్రశాంత్ నీల్ కి బర్త్ డే విషెస్ చెప్పారు. ఆగస్ట్ 15న ‘సలార్’ సినిమాని 2022 ఏప్రిల్ 14 నుంచి 2023 సెప్టెంబర్ 28కి వాయిదా వేస్తున్నట్లు షాకింగ్ అనౌన్స్మెంట్ బయటకి వచ్చింది. ఎన్నో అంచనాలతో సినిమా కోసం ఎదురు చూస్తున్న సినీ అభిమానులకి ఈ వాయిదా అనౌన్స్మెంట్ షాక్ ఇచ్చింది. కరోనా సెకండ్ వేవ్ ఊహించని విధంగా స్ప్రెడ్ అవ్వడంతో, షూటింగ్స్ వాయిదా పడ్డాయి. దీంతో చేసేదేమీ లేక సినిమాలు కరోనా ప్రభావం తగ్గాక సెట్స్ పైకి వెళ్లాయి.
ఈ వాయిదా ప్రకటన తర్వాత ‘సలార్’ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్పీడందుకుంది. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్ జరుపుకుంటూ షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేస్తున్న ఈ మూవీ నుంచి అక్టోబర్ నెలలో రెండు పోస్టర్స్ బయటకి వచ్చాయి. అందులో ఒకటి అక్టోబర్ 16న బయటకి వచ్చింది. మలయాళ హీరో పృథ్వీ పుట్టిన రోజు సంధర్భంగా… సలార్ సినిమాలో ‘వరదరాజ మన్నార్’గా నటిస్తున్నాడు అంటూ ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ రిలీజ్ చేసిన వారానికే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు కావడంతో ఆరోజు ప్రభాస్ ఫొటోస్ ని ‘సలార్’ చిత్ర యూనిట్ పోస్ట్ చేసింది. ఇవి గత రెండేళ్లలో సలార్ సినిమా నుంచి అఫీషియల్ గా వచ్చిన అనౌన్స్మెంట్స్ అండ్ అప్డేట్స్. పాన్ ఇండియా ఎపిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ‘సలార్’ సినిమా 2023 సెప్టెంబర్ 28న ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసి… కలెక్షన్స్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుందేమో చూడాలి.

తాజావార్తలు
-
PM Kisan: పీఎం కిసాన్ రైతులకు శుభవార్త.. ఆ రోజే డబ్బులు ఖాతాల్లోకి జమ..
-
Story Board : ఏపీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లేనట్లేనా ?
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!