Saithan Actor Arundhathi Nair Situation is still Critical: స్కూటీ ప్రమాదంలో చికిత్స పొందుతున్న నటి అరుంధతి నాయర్ పరిస్థితి విషమంగా ఉంది. తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా ఆమె నటించింది. తమిళంలో విజయ్ ఆంటోనీతో చేసిన ఒక సినిమా తెలుగులో బేతాళుడు పేరుతో రిలీజ్ అయింది. అందులో విజయ్ ఆంటోనీని మోసం చేసే జయలక్ష్మి అనే పాత్రతో ఆమె తెలుగు వారికి బాగా నోటెడ్. ప్రస్తుతం వెంటిలేటర్ సాయంతో అరుంధతిని బతికిస్తున్నారు వైద్యులు. అరుంధతి గత గురువారం కోవలం బైపాస్‌లో ప్రమాదానికి గురైంది. తలకు బలమైన గాయాలైన నటి పరిస్థితి విషమించడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి వెంటిలేటర్‌కు తరలించారు. అరుంధతి మెదడులో రక్తం గడ్డ కట్టిందని, పక్కటెముకలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని అంటున్నారు.
Meena: పాప ఉన్నా పర్లేదు.. మీనాను పెళ్లి చేసుకుని లైఫ్ ఇస్తా.. సినీ క్రిటిక్ నోటి దురద వ్యాఖ్యలు!
నటి సోదరి ఆర్తీ నాయర్ తన స్నేహితుడు శరత్ లాల్ సహాయం కోరుతూ పోస్ట్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీని షేర్ చేసింది. రోజువారీ ఆసుపత్రి ఖర్చులు భరించలేకపోతున్నాము, ఖర్చులు స్థోమతకు మించి అవుతున్నాయి. మీకు చేతనైనంత విరాళం అందించి సహాయం చేయండి అని పోస్ట్‌లో పేర్కొన్నారు. అరుంధతి గురించి సమాచారం కోసం చూస్తున్న వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అయితే అంతకు మించి ఇంకేమీ చెప్పే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. మలయాళం, తమిళ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు సుపరిచితమైన అరుంధతి. ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి తన సోదరుడితో కలిసి తిరిగి వస్తోండగా అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వీరి స్కూటీని ఢీకొన్న వాహనం ఆగకుండా వెళ్ళిపోయింది. గాయపడిన వారిద్దరూ గంటపాటు రోడ్డుపైనే పడి ఉండగా కొందరు వారిద్దరినీ ఆసుపత్రికి తీసుకెళ్లారు.