Saif Ali Khan Lost His Movie Offer For Girlfriend: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ధనవంతుడు అవ్వడమే కాదు, అతనికి మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అతని తండ్రి మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఒక గొప్ప క్రికెటర్. మరి.. ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నప్పుడు సైఫ్‌కి ఇండస్ట్రీలో రావడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చని అంతా అనుకోవచ్చు. కానీ, అతనికి కూడా కొన్ని ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఓ డైరెక్టర్ పెట్టిన అనూహ్య కండీషన్ వల్ల.. అతడు ఒక సినిమా ఛాన్సే వదులుకోవాల్సి వచ్చింది. అవును.. ఇది నమ్మశక్యంగా లేకపోయినా, నిజంగానే జరిగింది. ఈ విషయాన్ని తానే స్వయంగా రివీల్ చేశాడు. ప్రియురాలు, సినిమా మధ్యలో ఒక్కటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని డైరెక్టర్ తనకు చెప్పాడని.. తాను కుదరదని చెప్పడంతో సినిమా నుంచి తీసేశారని పేర్కొన్నాడు.
Yuzvendra Chahal: చాహల్ సరికొత్త రికార్డ్.. ఐపీఎల్‌లో తొలి భారత బౌలర్‌గా..
సైఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘సినీ పరిశ్రమలో ఆఫర్లు పొందడం కోసం తాము ఎన్నో కష్టాలు పడ్డామని చాలామంది చెప్తుంటారు. ఆడిషన్స్ కోసం తిరగడం, ఆఫీసుల్లో గంటల తరబడి వెయిట్ చేయడం లాంటివి చేశామని అంటుంటారు. కానీ, నాకు మాత్రం అనూహ్యమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. నిజానికి.. నేను ‘బేఖుది’ సినిమాతో తెరంగేట్రం చేయాల్సింది. కానీ.. ఆ సినిమా దర్శకుడు రాహుల్ రావల్ నాకు ఒక విచిత్రమైన కండీషన్ పెట్టాడు. నీకు సినిమా కావాలా? నీ ప్రియురాలు కావాలా? అని అడిగాడు. ఆ రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే ఎంపిక చేసుకోవాలని చెప్పాడు. అప్పుడు సినిమా కోసం నా గర్ల్‌ఫ్రెండ్‌ను ఎందుకు వదిలేయాలన్న గందరగోళం నెలకొంది. కాసేపు ఆలోచించి, నేను అందుకు కుదరదని చెప్పాను. దీంతో.. నన్ను ఆ సినిమాలో నుంచి తొలగించారు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత కూడా తనపై వచ్చిన వదంతులు చూసి, తనకు సినిమాలు చేయాలనే ఆసక్తి లేదని ఆ దర్శకుడు భావించాడని.. అందుకే తనతో సినిమా చేయలేదని సైఫ్ స్పష్టం చేశాడు.
Gold Mine Fire: బంగారు గనిలో అగ్ని ప్రమాదం.. 27 మంది మృతి
కాగా.. ఆశిక్ ఆవారా సినిమాతో తెరంగేట్రం చేసిన సైఫ్, ఆ తర్వాత ఎన్నో హిందీ సినిమాల్లో కథానాయకుడిగా నటించాడు. కొన్ని సంవత్సరాల పాటు బాలీవుడ్‌ని ఏలాడు. అయితే.. కాలక్రమంలో ఇతని క్రేజ్ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు హీరోగా ఇతను చేస్తున్న సినిమాలు పెద్దగా రాణించడం లేదు. ఈ నేపథ్యంలోనే అతడు రూట్ మార్చాడు. ఓవైపు హీరోగా సినిమా చేస్తూనే.. మరోవైపు విలన్‌గా పాత్రలు పోషిస్తున్నాడు. ప్రస్తుతం అతడు పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్‌లో రావణుడిగా.. అలాగే జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రంలోనూ విలన్‌గా కనిపించనున్నాడు.