Sai Rajesh: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో బేబీ సినిమా చిక్కుకుంది. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న వారు.. బేబీ సినిమా చూసే.. డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. “బేబీ సినిమాలో డ్రగ్స్ ఏవిధంగా ఉపయోగించాలని దృశ్యాలను చూపించారు.. ఇలాంటి వాటిని దృశ్యాలను చేయవద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం.. బేబీ సినిమా వాళ్లకు నోటీసులు ఇస్తాం.. ఇప్పటి నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుంది” అని ఆయా తెలిపారు. ఇక ఈ విషయమై బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ స్పందించాడు.
Tollywood Drugs Case: టాలీవుడ్ లో డ్రగ్స్ కలకలం.. పరారీలో హీరో నవదీప్
“బేబీ టీంకు సీపీ కార్యాలయం నుండి కాల్ వచ్చింది. బేబీ సినిమాలో డ్రగ్ యూసేజ్ పై క్లారిటీ గురించి అధ్వయీసర్ నోటీస్ ఇచ్చారు. సినిమా బీట్ లో డ్రగ్స్ వాడుతున్నట్లు ఉంది. ఈలాంటి సన్నివేశాలు వాడేటప్పుడు బ్లర్ చేయాలని వారు సూచించారు. సెన్సార్ లో సీన్స్ ఇప్పుడు కట్ చేయలేం.. కాబట్టి ఒకటే చెప్తున్నా.. డ్రగ్ బారిన యువత పడొద్దు..డ్రగ్స్ వలలో పడితే బయటికి రావడం కష్టం..మా టీంపై బాధ్యత ఉంది. బెస్ట్ ఫ్రెండ్ & బాడ్ ఫ్రెండ్స్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలనీ బేబీ సినిమా తీశాం. అంతే తప్ప డ్రగ్స్ ప్రోత్సహించే విధంగా మేము సినిమా తీయలేదు. నా తోటి డైరెక్టర్ లకు విన్నపం డ్రగ్స్ ప్రోత్సహించే విధంగా సన్నివేశాలు తీయొద్దు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.