Sai Pallavi: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫిదా సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన సాయి పల్లవి.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక మూడు రోజుల క్రితమే సాయి పల్లవి చెల్లి పూజా కన్నన్ కు నిశ్చితార్థం జరిగింది. అయితే అక్క పెళ్లి చేసుకోకుండా.. చెల్లి పెళ్లి చేసుకోవడం ఏంటని అభిమానులందరూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాయి పల్లవికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా.. ? అసలు పెళ్లి చేసుకోదా.. ? అని ఫ్యాన్స్ ఆందోళన పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి తన పెళ్లి గురించి గతంలో చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
“నేను 18 ఏళ్లు ఉన్నప్పుడు 23 ఏళ్లకే పెళ్లి చేసుకోవాలని, 30 ఏళ్లలోపు ఇద్దరు పిల్లలకు కనాలని అనుకున్నాను. ఎంబీబీఎస్ చదివే రోజుల్లో ఆ నిర్ణయాలు మారిపోయాయి. నా కుటుంబంలో నేనే పెద్దదాన్ని కావడంతో .. కీలక బాధ్యతలు నా మీద ఉన్నాయి. అందుకే అప్పట్లో పెళ్లిని వాయిదా వేశాను. హీరోయిన్ గా మారాక పెళ్లి ఇంకాస్త వాయిదా పడింది” అని చెప్పుకొచ్చింది. ఇక తన పెళ్లి వలన చెల్లి పెళ్లి వాయిదా పడకూడదు అని వారి ప్రేమను అంగీకరించి పెళ్లి చేస్తుంది. మరి ఈ భామ కూడా త్వరలోనే పెళ్లి చేసుకుంటుందేమో చూడాలి.