రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘విరాటపర్వం’. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను డి. సురేష్‌బాబు సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించారు. 1990ల సమయంలో జరిగే కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 17న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ‘విరాటపర్వం’ ఆత్మీయ వేడుక ఈవెంట్ ను వరంగల్ లో నిర్వహించారు. ఈ వేడుక లో హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ ” ఇక్కడ ఎలా మనం భద్రకాళి టెంపుల్ కి వెళ్లి దండం పెట్టుకొని వెళ్తామో.. నాకు తెలిసి నేను ఇక్కడికి వచ్చినప్పుడు అందరి దగ్గర ఒక కోరిక పెట్టి వెళ్తే మూవీ చాలా వస్తుంది.. అందరు వచ్చి చూస్తారు అని ఒక ఆశ ఉంది. నాకు చాలా సంతోషం ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు.. వరంగల్ నేను ఎప్పుడు వచ్చినా నా ఇంటికి వచ్చినట్లు ఉంటుంది. లాస్ట్ టైమ్ శ్యామ్ సింగరాయ్ కు వచ్చాను.. ఇదే ప్రేమను చూపించారు. కళ లేకుండా మనం ఉండలేం.. మనం లేకుండా కళ కూడా ఉండదు.. ఇది చాలా ఒక నిజాయితీ గల కథ.. మన మట్టి కథ.. ఇక్కడే పుట్టి, పెరిగిన వారి కథ.. ఇది మనం ఆదరించలేదంటే ఎవరు ఆదరిస్తారు.. అందరు దయచేసి సినిమాను వెళ్లి చూడండి.
ఇది చాలా ముఖ్యమైన కథ.. నాకెప్పుడు ఒక నమ్మకం ఉంది.. 20, 30 ఏళ్ళ క్రితం ఒక నిజం కోసం, ఒక ప్రేమకోసం ఎవరైతే పోరాడారో.. ఇలాంటి కథలు వచ్చినప్పుడు వారి ఆశీర్వాదాలు కూడా ఉంటాయని అనుకుంటున్నా.. వారి బ్లెస్సింగ్స్ , మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి.. కొన్నిసార్లు ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు మనం ఆదరించలేదంటే.. దీని తరువాత ఇలాంటి కథలు చేయడానికి బలం రాదు. దేశంలో కొత్త కథలు వస్తున్నప్పుడు మీరెలా ఆదరిస్తున్నారో ఈ సినిమాను కూడా అలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి పాత్రలు నాకిచ్చినందుకు దేవుడి దగ్గర థాంక్స్ చెప్తాను.. ఈ సినిమా నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ వేణు ఊడుగుల గారికి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ చిత్రంలో భాగం అయ్యినందుకు చాలా గర్వపడుతున్నాను. నా టీం అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.. ఇక అభిమానం గురించి రెండు మాటలు చెప్తున్నాను.. మీ ప్రేమకు నేనెప్పుడు రుణపడి ఉంటాను.. కథ ద్వారానే నా ప్రేమను మీకు అందిస్తున్నాను. అలాంటి ఒక కథ.. నేనిచ్చే ప్రేమను మీరు ఈ సినిమాకి వచ్చి తీసుకొంటే నేను సంతోషంగా తీసుకుంటాను” అంటూ చెప్పుకొచ్చింది.