‘రిపబ్లిక్’ మూవీ చూసిన సాయితేజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాయితేజ్ నటించిన తాజా చిత్రం ‘రిపబ్లిక్’ గాంధీ జయంతి కానుకగా, అక్టోబర్ 1న థియేటర్లలో విడుదలైంది. దేవ కట్టా దర్శకత్వంలో భగవాన్, పుల్లారావు నిర్మించిన ఈ సినిమా విమర్శకులు, మేధావుల ప్రశంసలు పొందింది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడంలో న్యాయస్థానాల పాత్ర ఎంతో ఉందని ఈ సినిమా ద్వారా దేవ కట్టా తెలిపారు.
రాజకీయ నాయకుల కనుసన్నలలో ప్రభుత్వ అధికారులు మసలినంత కాలం ఈ వ్యవస్థ బాగుపడదనే విషయాన్ని నిర్మొహమాటంగా చూపారు. దారితప్పిన ప్రజాస్వామ్యాన్ని ఓ యువ ఐఎఎస్ అధికారి ఎలా గాడిలో పెట్టాడు, దాని పర్యవసానం ఏమిటీ? అనే అంశాలను హృదయానికి హత్తుకునేలా దేవ కట్ట ‘రిపబ్లిక్’లో చూపించారు. అయితే ఈ సినిమా విడుదలకు కొద్ది రోజుల ముందు రోడ్డు ప్రమాదానికి గురైన హీరో సాయితేజ్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనలేక పోయారు. సినిమా విడుదలైన తర్వాత కూడా దానిని చూడలేదు. శుక్రవారం ఈ సినిమా జీ 5లో స్ట్రీమింగ్ కావడంతో తన టీమ్ తో కలిసి ఆయన ఇంట్లోనే ‘రిపబ్లిక్’ను చూశారు. ‘పంజా అభిరామ్ పాత్ర పోషించడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, అలానే జీ 5లోనూ ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తున్న వీక్షకులకు కృతజ్ఞతలు’ అని సాయితేజ్ తెలిపారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు.
Also Read
- Sreeleela: ఇక్కడ పక్కన పెట్టారు.. అక్కడ శ్రీలీల క్రేజ్ మామూలుగా లేదుగా!
- Kiran - Tej Forever: ఓ ఇంటివాడు కాబోతున్న సాయిదుర్గా తేజ్.. వధువు ఫోటో వైరల్!
- Jailer 2 OTT Release Date: ఓటీటీలోకి రజనీకాంత్ మాస్ తాండవం.. ‘జైలర్ 2’ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్!
- Dada Release Date: 'అఖండ 2' సీన్ రిపీట్ కానుందా? బాలయ్య 'దాదా'పై సస్పెన్స్!
తాజావార్తలు
-
Hormuz Strait Crisis: హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన.. అమెరికా ముందు ఏడు షరతులు..
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
Dhanteras 2026: లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి? బంగారం కొనడానికి సరైన సమయం ఏది..?
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!
-
Brendan Taylor: 40 ఏళ్ల వయసులో బ్రెండన్ టేలర్ సెంచరీ.. 8 ఏళ్ల నిరీక్షణకు తెర.. టెస్టు క్రికెట్లో అరుదైన రికార్డు..!
-
Stock Market Rally: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు.. సెన్సెక్స్ 2,000 పాయింట్ల జంప్.. ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..!
-
Virat Kohli: కాలం ఎవరికీ ఆగదు.. విరాట్ కోహ్లీ ఆఖరి పోరాటం.. అయినా ఇంకా 14 కొట్టొచ్చు ఇలా!