Sai Dharam Tej: మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మించారు. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని కలక్షన్స్ వైపు దూసుకెళ్తోంది. యుద్ధంతో రాసిన ప్రేమకథ గా తెరకెక్కిన ఈ సినిమా అటు అభిమానులతో పాటు ఇటు ప్రముఖులను కూడా మెప్పిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక తాజగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తనదైన రీతిలో ఈ సినిమాపై ప్రశంసలు కురిపించాడు. అఖిల్ నటించి హలో చిత్రంలో ప్రేమ ఎక్కువ అయితే ఐ హేట్ యూ చెప్తారు అని విక్రమ్ కె కుమార్ చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది. తేజు కూడా అదే మాటను వాడుతూ ఒక లేఖను రాసుకొచ్చాడు. ప్రతి ఒక్కరి పనితనాన్ని మెచ్చుకుంటూ వారి గురించి రాసుకొచ్చాడు. ప్రియమైన సీతారామం టీమ్ అందరికీ, మీ సాయి ధరమ్ తేజ్ వ్రాయునది.. అంటూ మొదలుపెట్టిన తేజు మొదటగా సినిమా గురించి రాసుకొచ్చాడు. ఈ సినిమాకు మొదట ఐ హేట్ యూ చెప్తున్నాను.. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి ఐ హేట్ యూ చెప్తున్నాను.
స్వప్న అక్క.. ఐ హేట్ యూ. రామ్ సీత ల ప్రేమకథను నమ్మి రెండేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డావు. ఒక నిర్మాతగానే కాకుండా నిజమైన ప్రేమ ఎప్పటికీ వీడదు అని అందరికి రుజువు చేశావు. ఈ ప్రేమకథతో సింగిల్ గా ఉన్న నాకు కూడా ఒక ప్రేమకథ ఉంటే బావుండు అనిపించేలా చేసావు.
హను ఐ హేట్ యూ.. ప్రతి ఫ్రేమ్ ను మ్యాజిక్ తో నింపి నీ పనితనాన్ని చూపించావు. నీ నటీనటులందరి చేత మంచి నటనను తెప్పించావు.. వంద శాతం వారు తమ నటనను కనపరిచారు. కేవలం అది నీ వలనే అయ్యింది. ఒక అద్భుతమైన పెయింటింగ్ లేదా ఒక మ్యూజిక్ పీస్ ను క్రియేట్ చేశావ్. నువ్వు చెప్పినట్లే సెకండ్ హాఫ్ ను చెడగొట్టకుండా ఎన్నో రంగులు అద్ది అందరి మనసులు ఎగిరేలా చేసావ్.. ఎస్పీ చరణ్.. ఈ వింటేజ్ సాంగ్స్ తో మీ తండ్రి గారు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యాన్ని గుర్తుచేశారు.
దుల్కర్.. నీ పాత సినిమాలు చూసి నీ పనితనానికి నేను ముగ్దుడిని అయ్యాను. కానీ ఈ సినిమాకు మాత్రం ఐ హేట్ యూ. ఇలాంటి ఒక సినిమాలో హీరోగా చూసినందుకు.. ప్రతి ఒక్క సీన్ లో నిన్ను చూసి నేను మంత్ర ముగ్దుడ్ని అయిపోయాను .. నువ్వు రామ్ గా శ్వాస తీసుకున్నావ్, రామ్ గా నడిచావ్.. రామ్ గా కూర్చొన్నావ్.. చివరికి రామ్ గా మారిపోయావు.
రష్మిక.. ఒక నటిగా నువ్వు ఎన్నో సినిమాలలో గుర్తింపు తెచ్చుకున్నావు. కానీ ఈ సినిమాలో నీ నటన, నీ కాన్ఫిడెన్స్ సినిమా మొదటి నుంచి చివరి వరకు నీ బాడీ లాంగ్వేజ్ అద్భుతం. చిన్నారి అమాయకపు అఫ్రీన్ చివరివరకు నీ పాత్ర ఎంతో అందంగా ఉంది. రామ్ సీత ల మధ్యలో మధ్యవర్తిగా ఉన్నందుకు ఐ హేట్ యూ..
సుమంత్ అన్న.. ఇప్పటివరకు నువ్వు చేసిన పాత్రలన్నీ అయిపోయాయి. నువ్వు నటించిన మళ్లీ రావా చిత్రం ఇప్పటివరకు నా ఫేవరేట్. కానీ ఈ సినిమా తరువాత అది మారిపోయింది.
విశాల్ చంద్ర శేఖర్.. నువ్వు ఈ సినిమాకు జీవాన్ని పోశావ్. నీ సంగీతం ఒక ప్రధాన కారణం .. మేము సినిమాను థియేటర్లో చూడడానికి.. ఎంతో స్మూత్ గా సాగిపోతోంది.
సీత.. ఈ పేరు మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయాలి. దయచేసి ఆమె మీద కంప్లైట్ తీసుకొని అరెస్ట్ చేయండి.ఎంతో మంది హృదయాలను ఆమె గాయపరిచింది. నేను ఐ హేట్ యూ అని మర్చిపోయి వేరేది చెప్పేలోపు దయచేసి ఆమెను అరెస్ట్ చేయండి” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.
ప్రియమైన #SitaRamam టీమ్ అందరికీ,
మీ సాయి ధరమ్ తేజ్ వ్రాయునది.. ✍️@hanurpudi@dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema pic.twitter.com/eQMZk8MdCF— Sai Dharam Tej (@IamSaiDharamTej) August 9, 2022