Sai Daram Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మేనమామ పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుస్తూ సినిమాల పరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక చిన్న సినిమాలను ఆదరించడంలో మెగా కుటుంబం ఎప్పుడు ముందే ఉంటుంది. తాజాగా తేజ్.. కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యం విష్ణు కథ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్లి ట్రైలర్ లాంచ్ చేశాడు. ఈ సందర్భంగా తేజ్ మాట్లాడుతూ అభిమానులతో సందడి చేశాడు. సందడి చేయడం వరకు బాగానే ఉన్నా.. తేజ్ మాట్లాడిన మాటలు కొన్ని అభిమానులు నొచ్చుకొనేలా ఉన్నాయని అంటున్నారు.
Read Also: Off The Record: మంత్రి ధర్మాన మాట తూలుతున్నారా? అసహనమా లేక అభద్రతా?
“ఈ సినిమా ట్రైలర్ చాలా బావుంది. నిర్మాత బన్నీ వాస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రావాలని పిలిచారు. అంతకు ముందు కిరణ్ కూడా ఎన్నో ఈవెంట్స్ కు నన్ను రమ్మని పిలిచాడు.. రాలేకపోయాను.. కిరణ్ ఐయామ్ సారీ. ఇప్పుడు వచ్చాను. ఇక ట్రైలర్ లో కాన్సెప్ట్ చూసి చాలా హ్యాపీగా అనిపించింది. కొత్తగా అనిపించింది. కాకపోతే ఆ లక్ నాకు రాలేదు.. నాపైన మా అమ్మ నెంబర్.. కింద మా నాన్నగారి నెంబర్. నాకు అంత కాంట్రవర్సీలు లేవు. ఇక చిత్ర బృందానికి నా బెస్ట్ విషెస్.. సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇక అంతలోనే అభిమానులు అన్నా పెళ్లి ఎప్పుడు అని అరవగా.. ” చెప్తా.. మీరెప్పుడైతే అమ్మాయిలను రెస్పెక్ట్ చేస్తారో అప్పుడు.. మీ వల్ల అవుతదా..” అని అనేశాడు. ఇక అవుతుంది అని వాళ్ళు అనగానే.. పెళ్లి ఎవ్వడు రా.. ముందు మీరు రెస్పెక్ట్ నేర్చుకోండి.. పెళ్లి ఎప్పుడో అయిపోయింది.. నాలుగు సార్లు అయ్యింది పెళ్లి అంటూ చెప్పుకొచ్చాడు. ఇది సరదాకే అన్నా.. అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి అని అభిమానులను అలా అనడం కొంతమంది తీసుకోలేకపోతున్నారు. కొంతమంది అలా ఉంటారు కానీ అందరు అలా ఎందుకు ఉంటారు. మీరందరు అని పర్టికులర్ గా చెప్పడం కొద్దిగా హార్ష్ గా ఉందంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. తాము అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇస్తున్నామని అంటున్నారు.