మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఆచార్య’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘శానా కష్టం’ అనే స్పెషల్ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. “శానా కష్టం వచ్చిందే మందాకిని…చూసేవాళ్ల కళ్లు కాకులెత్తుకు పోనీ” అనే సాహిత్యంతో మొదలయ్యే ఈ పాట వింటుంటే ఉత్సాహంగా ఉంది. ఈ పెప్పీ నంబర్‌లో చిరు, రెజీనా కసాండ్రా కలిసి స్టెప్పులేశారు. ఎప్పటిలాగే చిరు డాన్స్‌లో తన గ్రేస్, ఈజీని మెయింటెన్ చేస్తున్నాడు.
Read Also : పెద్దరికం నాకొద్దు… మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్
ఇక రెజీనా గ్లామర్ ను మరింతగా పెంచేసింది. ప్రకాశవంతమైన ఎరుపు, నలుపు దుస్తులు ధరించి అద్భుతమైన మిడ్‌రిఫ్ షో స్క్రీన్ లో మరింత హాట్ నెస్ ను పెంచేస్తోంది. మాస్ లవర్స్‌కి ఈ సాంగ్ పండగలా ఉంది. ఏస్ మ్యూజిక్ కంపోజర్ మణి శర్మ మరోసారి తన బెస్ట్ అందించారు. రేపు పూర్తి లిరికల్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు మేకర్స్. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నారు. అధిక బడ్జెట్‌తో రూపొందుతున్న ‘ఆచార్య’ 2022 ఫిబ్రవరి న థియేట్రికల్ విడుదలకు సిద్ధంగా ఉంది.
Read Also : కాజల్ అభిమానులకు శుభవార్త… ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్