మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప” విడుదలకు ఇంకా నెలరోజులు మిగిలి ఉంది. అప్పుడే బన్నీ అభిమానులు కౌంట్ డౌన్ మొదలు పెట్టేశారు. ఇక మేకర్స్ సైతం ప్రమోషన్ కార్యక్రమాలను సిద్ధమవుతున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా మొదటి భాగం “పుష్ప: ది రైజ్” పేరుతో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మేకర్స్ “పుష్ప: ది రైజ్” ఆల్బమ్ నుండి మూడవ పాటను ఆవిష్కరించారు. “సామీ సామీ” అంటూ సాగిన ఈ పెప్పీ డ్యాన్స్ నంబర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
Read Also : చైతో ఆ ఫొటోలన్నీ డిలీట్ చేసిన సామ్… ఏకంగా 85 !!
అద్భుతంగా ఉన్న లిరిక్స్, వాటికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అదిరిపోయాయి. ఇక ఈ పాటకు మౌనిక యాదవ్ వాయిస్ సూపర్ గా కుదిరింది. చంద్రబోస్ సాహిత్యం అందించారు. ‘పుష్ప’రాజ్ పై శ్రీవల్లి తన ప్రేమను కురిపించే ఈ సాంగ్ కూడా ఇంతకుముందు విడుదలైన రెండు పాటల్లాగే ఆసక్తికరంగా ఉంది. “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న థియేటర్లలో విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇందులో ఫహద్ ఫాసిల్, సునీల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.