Rashmika – Rukmini : నేషనల్ క్రష్ రష్మిక స్పీడ్ కు బ్రేకులు పడనున్నాయా అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. మనకు తెలిసిందే కదా పుష్ప సినిమా తర్వాత ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దాని తర్వాత వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుంది. యానిమల్, చావా లాంటి సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ ను మరింత పెంచుకుంది. అలాంటి రష్మికకు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఆమె ప్లేస్ ను మరో కన్నడ బ్యూటీ భర్తీ చేసేలా కనిపిస్తోంది. ఆమె ఎవరో కాదు రుక్మిణీ వసంత్. ఛాలెంజింగ్ పాత్రలు చేయడంలో రుక్మిణీ దిట్ట. మొన్న కాంతార చాప్టర్ 1లో నటించి మంచి హిట్ అందుకుంది. ఆ మూవీతో ఆమెకు మంచి బ్రేక్ వచ్చిందనే చెప్పుకోవాలి.
Read Also : Naga Chaitanya : ఆ సినిమా తర్వాత నాగచైతన్యతో శోభిత గొడవ..
ఇక తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ సినిమాలోనూ నటిస్తోంది. దీంతో పాటు రామ్ చరణ్, సుకుమార్ సినిమాలోనూ ఆమెను తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. అటు బాలీవుడ్ లో తెరకెక్కే భారీ సినిమాల్లోనూ ఆమెను తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారంట. డ్రాగన్ సినిమా రిలీజ్ అయ్యాక రుక్మిణీ క్రేజ్ మరింత పెరగడం ఖాయం అంటున్నారు. అదే జరిగితే ఆమె రేంజ్ అమాంతం మారిపోతుంది. ఇప్పుడు ఎలాగూ రష్మిక విజయ్ దేవరకొండను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయింది. కాబట్టి ఆమె పెళ్లి తర్వాత క్రేజ్ తగ్గిపోతుంది. అందుకే ఆమె ప్లేస్ ను కొట్టేయడానికి రుక్మిణీ బాగానే ప్లాన్ వేస్తోందన్నమాట. ప్రస్తుతం ఆమె కాంతార సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది.
Read Also : Allari Naresh : పాములకు భయపడి.. బ్లాక్ బస్టర్ మూవీని వద్దన్న అల్లరి నరేశ్..
