ఆ ప్రశ్నలతో ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. జనవరి 7 న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. గత రెండు రోజుల నుంచి అన్ని భాషల్లో ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. ఇక నేడు హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ ఆద్యంతం ఆసక్తిగా జరిగింది. కొన్ని ఫన్నీ మూమెంట్స్, మరికొన్ని సినిమా విశేషాలతో ప్రెస్ మీట్ అద్భుతంగా జరిగింది. ఇక ఈ నేపథ్యంలో కొన్ని ప్రశ్నలు ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి అడిగినట్లు అభిమానులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీ లో టికెట్ ఇష్యూ నడుస్తున్న సంగతి తెలిసిందే. అకస్మాత్తుగా టికెట్ ధరలు తగ్గించడంతో అనేక సినిమాలకు ఇది ఎక్కువ ప్రభావం చూపడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒక రిపోర్టర్ .. ఏపీ టికెట్ ధరల విషయంలో ఎన్టీఆర్ హెల్ప్ ఏమైనా తీసుకున్నారా..? ఆయన ఫ్రెండ్స్ ఏపీలో మంచి పొజిషన్ లో ఉన్నారు కదా..? అని అడగడం అక్కడ సంచలనంగా మారింది. ఈ ప్రశ్నకు కొద్దిగా ఎన్టీఆర్ షాక్ అయినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా ఆయన మౌనంగా ఉండడం కూడా పలు అనుమానాలకు తావిస్తోంది అని అంటున్నారు నెటిజన్లు.
Also Read
ఇకపోతే ఈ ప్రశ్నకు నిర్మాత డీవీవీ దానయ్య స్పందిస్తూ ” భారతదేశం అంతా ఉన్న ధరలు ఏపీలో మాత్రం ఉన్న వేరే ధరలు ఖచ్చితంగా ప్రభావం చూపుతున్నాయి. మేము వారిని అడిగాము.. ఇంకా ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. ఒక సానుకూలమైన స్పందనే వస్తుందని ఆశిస్తున్నాం” అని తెలిపారు. అయితే ఈ ప్రశ్న ఎన్టీఆర్ ని టార్గెట్ చేసినట్లుగానే ఉందని నెటిజన్స్ నొక్కి వక్కాణిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్రెండ్స్ అంటే వల్లభనేని వంశీ, కొడాలి నాని అని , వారు ఏమైనా ఎన్టీఆర్ కి హెల్ప్ చేయనున్నారా..? అని రాజకీయాలలోకి ఎన్టీఆర్ ని లాగుతున్నారని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రశాంకు ఎన్టీఆర్ సమాధానం చెప్పకపోవడం కూడా ఒక్కందుకు మంచిదేనని మరికొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రశ్నలు నెట్టింట వైరల్ గా మారాయి.
తాజావార్తలు
-
Shoaib Malik Fourth Marriage Rumours: 44 ఏళ్ల షోయబ్ మాలిక్ నాలుగో పెళ్లి వార్తలు..! నిజమెంత?
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?