ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. రాజమౌళి, రామ్ చరణ్, రామారావు త్రయం కాంబోలో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో జనవరి 7 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్లను వేగంవంతం చేశారు చిత్ర బృందం. ఇటీవల అన్ని భాషల్లోనూ ప్రెస్ మీట్స్ పెట్టిన జక్కన్న ఎక్కువగా హిందీ మీడియా మీద ఫోకస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే నిన్న ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ వేడుక ముంబైలో గ్రాండ్ గా నిర్వహించారు.
అనంతరం ముంబై మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ కనిపించారు. ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం ‘ఆర్ఆర్ఆర్’ గురించే చర్చ అంటే అతిశయోక్తి కాదు. ఇక ఇంటర్వ్యూలకు ముందు ముంబైలో ఈ ‘ఆర్ఆర్ఆర్’ త్రయం కలిసి దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ‘ఆర్ఆర్ఆర్’ షర్ట్ లతో తారక్, చరణ్ రాయల్ లుక్ లో కనిపించగా .. జక్కన్న ‘ఆర్ఆర్ఆర్’ టీ షర్ట్ లో క్లాస్ గా కనిపించాడు. ముంబై ని షేక్ ఆడించడానికి హీరోలు వచ్చారు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
One-on-one interviews are underway in Mumbai 💥💥💥 #RRRMovie #RRRPromotions #RoarOfRRRInMumbai pic.twitter.com/mpgqmvDgRL
— RRR Movie (@RRRMovie) December 20, 2021