బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీపై దాడి జరిగింది. బిగ్ బాస్ 5 సీజన్ విన్నర్ గా గెలిచిన సన్నీ బయటికి వచ్చాకా పలు సినిమా అవకాశాలను అందుకునాన్డు. ఈ నేపథ్యంలోనే సన్నీ హీరో ఏటీఎం అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ఇక తాజగా ఈ షూటింగ్ దగ్గరకు హైదరాబాద్ కు చెందిన ఒక రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. షూటింగ్ దగ్గరకు వచ్చి సన్నీతో గొడవకు దిగాడు.
అంతేకాకుండా అతడిపై దాడికి పాల్పడడానికి ప్రయత్నించాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన చిత్ర బృందం సన్నీని షూటింగ్ నుంచి కారులో పంపించేసి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని రౌడీ షీటర్ ను అరెస్ట్ చేశారు. అయితే సెలబ్రెటీలపై దాడులు చేస్తే మీడియాలో హైలెట్ అవుతారన్న ఉద్దేశ్యంతో రౌడీ షీటర్ ఈ దాడికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే అసలు రౌడీ షీటర్ ఎందుకు ఈ దాడికి పాల్పడ్డాడు అనేది తెలియాల్సి ఉంది..