హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా నిలిచింది ఏక్తా కపూర్. సీరియల్స్ నుంచి సినిమాలు, వెబ్ సీరీస్ ల వరకూ అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ కి ఇచ్చింది ఏక్తా కపూర్. ఆల్ట్ బాలాజీ యాప్ ని క్రియేట్ చేసి మరీ ప్రేక్షకులని అలరిస్తున్న ఏక్తా కపూర్… రాగిణీ MMS, డర్టీ పిక్చర్, ఉడ్తా పంజాబ్, ఏక్ విలన్ లాంటి ఎన్నో సినిమాలని హిందీలో ప్రొడ్యూస్ చేసి ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ వైపు అడుగులు వేస్తోంది. కెనెక్ట్ మీడియా, AVS స్టూడియోస్ తో టైఅప్ అయ్యి ఏక్తా కపూర్ ‘వృషభ’ అనే పాన్ ఇండియా సినిమా ప్రొడ్యూస్ చేస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఈ సినిమాలో మెయిన్ లీడ్ ప్లే చేస్తున్నాడు. నందకిషోర్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై నాలుగో వారం నుంచి స్టార్ట్ కానుంది.
ఇటీవలే వృషభ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి చేసిన ఫోటోషూట్ కోసం మోహన్ లాల్ ముంబై వచ్చాడు. సూపర్ స్టార్ జితేంద్ర కూడా ఈ ఫోటోషూట్ లో పాల్గొన్నాడు. బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన వృషభ సినిమా 200 కోట్ల బడ్జెట్ తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో మోహన్ లాల్ కొడుకు పాత్రలో శ్రీకాంత్ కొడుకు నటించనున్నాడు. పెళ్లి సందD సినిమాతో టాలీవుడ్ లోకి సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్, డాన్స్, డైలాగుల విషయంలో మంచి మార్కులు కొట్టేసాడు. బాలీవుడ్ హీరోల కనిపించే రోషన్, మోహన్ లాల్ సినిమాలో నటిస్తుండడం గొప్ప విషయం అనే చెప్పాలి. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వనున్న వృషభ మూవీ 2023 చివరలో రిలీజ్ కానుంది. మరి వృషభ మూవీతో రోషన్ పాన్ ఇండియా ఐడెంటిటీ తెచ్చుకుంటాడేమో చూడాలి.
TELUGU ACTOR ROSHANN MEKA TO PORTRAY MOHANLAL’S SON IN PAN-INDIA FILM ‘VRUSHABHA’… #RoshannMeka – who has acted in several #Telugu films – will essay the part of #Mohanlal’s son in #Vrushabha.
Directed by #NandaKishore, the film – an epic action-entertainer transcending… pic.twitter.com/WEEjf2JKwR
— taran adarsh (@taran_adarsh) July 13, 2023